-తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి, ముఖ్యమంత్రి రోడ్డెక్కితే, ఆయనతో కలిసి పోరాడటానికి టీడీపీ సిద్ధంగా ఉంది
-టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు
కేంద్రంమెడలువంచైనా ప్రత్యేకహోదా తెస్తాననిచెప్పి, అధికారంలో కి వచ్చాక హోదాను కేసులభయంతో ఢిల్లీపెద్దలకు తాకట్టుపెట్టిన జగన్మోహన్ రెడ్డి, తనమూడేళ్ల పాలనలో కేంద్రంమెడలు ఎన్ని డిగ్రీ లుఎన్నిసార్లు వంచాడోచెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్య నారాయణరాజు ఎద్దేవాచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలో ని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా మీకోసం…!
28మంది ఎంపీలను తనచేతిలోఉంచుకున్న జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా కేంద్రప్రభుత్వంతోగానీ, ప్రధానిమోదీతోగానీ, ప్రత్యేకహో దా అంశంపై మాట్లాడాడా? కేంద్రప్రభుత్వం తాజాగా ప్రకటించిన అజెండాలో తొలుతహోదా అంశాన్నిచేర్చి, తిరిగి తొలగించడంపై ముఖ్యమంత్రి ఏపీప్రజలకు వివరణఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం . కేంద్రంహోదామాట ఎత్తగానే, రాష్ట్రంలోని వైసీపీనేతలు, మంత్రులుఏపీకి హోదావచ్చేసినంత తేలిగ్గా ఊదరగొట్టారు. ముఖ్య మంత్రి ఎప్పుడుఢిల్లీ వెళ్లినా, ఆయనపర్యటన తాలూకా వివరాలు రహస్యమే. కారణం ఏమిటంటే ఆయన కేంద్రపెద్దలతో రాష్ట్రప్రయో జనాలగురించి చర్చించరు. ఆయనచర్చించేది తనబాబాయ్ హత్య కేసు తనమెడకుచుట్టుకోకూడదని, తనపై ఉన్నఇతర అవినీతి కేసులను తొలగించాలని మాత్రమే. రేపు ఢిల్లీలో విభజనసమస్యల పరిష్కారానికి సంబంధించిన సమావేశం జరగబోతోంది. ఆ సమావేశంలో రాష్ట్రానికి కేంద్రం ఏమీప్రకటించకుంటే, మరీముఖ్యం గా హోదారాకుంటే, ఈ ముఖ్యమంత్రి తనపార్టీఎంపీలతో రాజీనా మాలు చేయించగలడా అని ప్రశ్నిస్తున్నాం.
గతంలో ప్రత్యేకహోదా అంశం ఇకఏరాష్ట్రానికిఉండదని కేంద్రం తెగేసిచెప్పాకనే, ఆనాడు చంద్రబాబునాయుడుగారు ప్రత్యేకప్యాకేజీకి ఒప్పుకున్నారు. అలానే రాష్ట్రానికి కేంద్రం అన్యాయంచేస్తోందని భావించే తనపార్టీ ఎంపీలు కేంద్రమంత్రివర్గంలో కొనసాగకుండా వారితోరాజీనామాలు చేయించారు. చంద్రబాబునాయుడు గారురాష్ట్రప్రయోజనాలకోసం మంత్రిపదవుల్ని కూడా తృణప్రాయంగా వదిలేస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎంపీపదవులకు తనపార్టీఎంపీలతో రాజీనామాలుచేయిం చకుండా కేంద్రంచూరుపట్టుకొని వేలాడుతూ, దేబరిస్తున్నాడు. ఇటీవలప్రకటించిన కేంద్రబడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటిలబ్ధికలగకపోయి నాకూడా ఈముఖ్యమంత్రి నోరెత్తలేదు. అదీ ఈయన సమర్థత. పోలవరానికి, యూనివర్శీటీలకు, విమానాశ్రయాల అభివృద్ధికి కేంద్రంనుంచి రూపాయికూడా జగన్మోహన్ రెడ్డిసాధించలేకపోయా డు. ప్లీజ్…ప్లీజ్ అంటూ అడుక్కోవడానికి జగన్మోహన్ రెడ్డికి 28 ఎంపీలు అవసరంలేదు. అడుక్కోవడానికి ఒక్కడున్నాసరిపోతాడు . తన పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయించి హోదా సాధిస్తాడో, లేక తానే కేంద్రంతో నేరుగా పోరాటానికి దిగుతాడో జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి.
రేపటి ఢిల్లీ సమావేశంలో రాష్ట్రవాణి బలంగావినిపించి, ముఖ్యమంత్రి కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాల ని డిమాండ్ చేస్తున్నాం. దేశంలో తనకేసులు, తనప్రయోజనాల గురించి మాత్రమే కేంద్రంచుట్టూ తిరిగే ఏకైకముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచాడు. పాదయాత్ర సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి హామీలిచ్చాడో, ఇప్పుడు ఎలా తప్పించుకుతిరుగు తూ, కేంద్రపెద్దలకుభయపడి, వారికి సాష్టాంగపడుతున్నాడో ప్రజలంతాకూడా ఆలోచించాలని కోరుతున్నాం. హోదాసహా, విభజ నహామీలపై ముఖ్యమంత్రి స్థానంలోఉన్న జగన్మోహన్ రెడ్డి అబద్ధా లుచెప్పడం సిగ్గుచేటు. కేంద్రంతో మాట్లాడి హోదాఅంశాన్ని అజెం డా నుంచి తీసేయించాల్సిన అవసరం చంద్రబాబుగారికి ఎందుకు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి హోదాసాధనకోసం కార్యాచరణ ప్రకటించి, తనపార్టీఎంపీలతో రాజీనామాలుచేయిస్తే, టీడీపీఎంపీలు కూడా రాజీనామాలుచేయడానికి సిద్దంగాఉన్నారు. రాజకీయ వైరుధ్యాలుంటే, అవిఎన్నికల సమయంలో చూసుకోవచ్చు. కానీ ఏపీప్రయోజనాలకోసం జగన్మోహన్ రెడ్డి రోడ్డెక్కితే ఆయనతో కలిసి ముందుకుసాగడానికి టీడీపీసిద్ధంగాఉంది. తాను ముఖ్యమంత్రి అయ్యాక జగన్మోహన్ రెడ్డి కేంద్రంనుంచి, రాష్ట్రానికి ఏం సాధించాడో వాస్తవాలతోకూడిన శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.