Suryaa.co.in

Andhra Pradesh Telangana

సజ్జల వ్యాఖ్తల వెనక మోడీ కుట్ర

-తెలంగాణ 24 గంటల కరెంటు ఇస్తోంది.. ఏపీ లో ఆ పరిస్థితి లేదు
-ఈ రోజు తెలంగాణ అన్న పూర్ణగా ఉంది ఏపీ కాదు
-అరవై ఏళ్లుగా తెలంగాణ ను దోచుకున్నది చాలదా?
-షర్మిల కు గవర్నర్ తో పాటు బీజేపీ శిక్షణ ఇస్తోంది
-ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు..అభివృద్ధి చెందిన తెలంగాణ
-కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామ రక్ష
-ఎమ్మెల్సీ, రైతు బంధు చైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గే మల్లేశం

ఆంధ్రా-తెలంగాణ మళ్లీ కలిసిపోవాలన్న ఏపీ ప్రభుత్వ సలహదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ విరుచుకుపడింది. ఆయన వ్యాఖ్యల వెనుక మోదీ ఉన్నారని ఆరోపించింది. ఇన్నాళ్లూ తెలంగాణను దోచుకుంది సరిపోలేదా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏమన్నారంటే..విభజన చట్టం వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయింది.తెలంగాణ పల్లెలు పచ్చ బడ్డాయి, హైద్రాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. తెలంగాణ పచ్చబడటాన్ని చూసి కొందరి కళ్ళు మండుతున్నాయ్. వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి ఏపీ విభజన పై విషం చిమ్మేలా మాట్లాడారు. ఆయన ఆషామాషీగా మాట్లాడారు అని భావించడం లేదు.

తెలంగాణ ఏర్పాటు ప్రక్రియనే తప్పుబట్టేలా మాట్లాడటం కొత్త కాదు.. చాలా మంది మాట్లాడారు.తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మోడీ సహా అవకాశం వచ్చినపుడల్లా చాలా మంది విషం చిమ్ముతున్నారు.ఆ కుట్రలు నిరంతరం కొనసాగుతున్నాయి.తల్లిని చంపి బిడ్డను వేరు చేశారని మోడీ మాట్లాడుతున్నారు.సజ్జల వ్యాఖ్తల వెనక మోడీ కుట్ర ఉంది.ఈ మధ్య మోడీ తరచుగా వైసీపీ నేతలతో మాట్లాడుతున్నారు.మోడీ దన్ను తోనే నాడు చంద్రబాబు మాట్లాడారు.. నేడు సజ్జల మాట్లాడుతున్నారు.

కేసీఆర్ ను ఎదుర్కొనేందుకు మోడీ ఎన్నో బాణాలు వదులుతున్నారు. తెలంగాణ ఉద్యమం సమయం లో ఇలాంటి కుట్రలు కేసీఆర్ సమర్ధంగా ఎదుర్కొన్నారు.. ఇపుడు కూడా ఎదుర్కుంటారు.బీజేపీ తెలంగాణ పై కె ఏ పాల్ సహా చాలా బాణాలు వదులుతోంది.తెలంగాణ టాగ్ లైన్ నీళ్లు నిధులు నియమాకాలను కేసీఆర్ తూచ తప్పకుండా పాటిస్తున్నారు.ఈ రోజు తెలంగాణ అన్న పూర్ణగా ఉంది ఏపీ కాదు.ఏ రంగం లో చూసినా తెలంగాణ పురోగతి ఏపీ ని దాటేసింది.

అక్కడున్న సమస్యల ను పక్క దారి పట్టించేందుకే తెలంగాణ ఏపీ లను కలువుతామని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.కరెంటు వినియోగం లో తెలంగాణ నంబర్ వన్ గా ఉంది.తెలంగాణ 24 గంటల కరెంటు ఇస్తోంది.. ap లో ఆ పరిస్థితి లేదు..పచ్చబడ్డ తెలంగాణ పై వారి కళ్ళు మండే అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. అక్కడ ప్రజలకు మేలైన పనులు చేయడం చేత గాకే బాగుపడ్డ తెలంగాణ తో కలవాలని వాళ్ళు అంటున్నారు. తెలంగాణ లో కలిసి ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.అరవై ఏళ్లుగా తెలంగాణ ను దోచుకున్నది చాలదా.. ఇంకా దోచుకోవాలని చూస్తున్నారా?మోడీ ఆదేశాల మేరకే కొందరు మొరుగుతున్నారని తెలంగాణ ప్రజలకు అర్థమైంది.కాళోజీ స్పూర్తితో టీ ఆర్ ఎస్ పని చేస్తుంది.ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఇక్కడ పాతర వేస్తాం.. ప్రాంతీతరుడు ద్రోహం చేస్తే తెలంగాణ పొలిమేరల దాకా తరిమేస్తాం.

ఇది ఎడ్డి గుడ్డి తెలంగాణ కాదు..అభివృద్ధి చెందిన తెలంగాణ. మళ్లీ తెలంగాణ, ap కలవడం గురించి చిల్లర మల్లర మాటలు మాట్లాడటం మానుకోవాలి.24 గంటల కరెంటు ను కచితంగా ఇస్తున్నాం..బండి సంజయ్ కు అనుమానం ఉంటే కరెంటు తీగను టచ్ చేసి చూడాలి.బండి ఏ విషయం మీద అవగాహన లేదు. షర్మిల కు గవర్నర్ తో పాటు బీజేపీ శిక్షణ ఇస్తోంది.మోడీ తో ఏం మాట్లాడాలో గవర్నర్ షర్మిల కు ట్రైనింగ్ ఇచ్చారు.

తెలంగాణ లో శాంతి యుత వాతావరణాన్ని చెడగొట్టాలనే ప్రయత్నం బీజేపీ ది.బీజేపీ విసిరే బొక్కలకు కొందరు ఆశ పడుతున్నారు.మేము ఎవరు రెచ్చగొట్టినా రెచ్చి పొము.తెలంగాణ ఇలానే ఉంటుంది.. ఎవ్వరూ మార్చలేరు.అవసరమైన సందర్భాల్లో తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ జాగృతం చేస్తారు.తెలంగాణ, ఏపీ కలయిక ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎన్ని జెండాలు ఉన్నా ఎవరి ఎజెండా ఎలా ఉన్నా కేసీఆర్ నాయకత్వమే తెలంగాణ కు శ్రీరామ రక్ష.

LEAVE A RESPONSE