మళ్ళీ సెంటిమెంట్ రగిలించే కుట్రలో భాగమే సజ్జల కామెంట్స్

– బిజెపిది గుజరాత్ లో నైతిక గెలుపు కాదు
– ప్రధాని స్థాయి మర్చిపోయి గుజరాత్ ప్రతినిధిలా మాట్లాడారు
– సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

సమైక్య రాష్ట్రం నినాదంపై సజ్జల రామకృష్ణ చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతం.తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రం కోరుకున్నారు కాబట్టే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. సమైక్య నినాదం ఇవ్వాళ కొత్త కాదు. రాష్ట్ర విజభన జరిగినప్పుడు కూడా వాళ్ళు అదే కదా అన్నారు.రాజకీయాల్లో నిరంతరం కాన్స్పెసిస్ నడుస్తూనే ఉంటాయి. మళ్ళీ సెంటిమెంట్ రగిలించే కుట్రలో భాగమే సజ్జల కామెంట్స్. హిమాచల్ ప్రదేశ్లో మంచి మెజార్టీతో కాంగ్రెస్ విజయం సాధించడం దేశంలో మారుతున్న రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది.

హిమాచల్ ప్రదేశ్ ఓటర్లకు, కాంగ్రెస్ విజయం కొరకు కృషి చేసిన క్యాడర్ కు అభినందనలు. ఓట్లు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు.మోడీ చేస్తున్న ఆకృత్యాలు, ఆరాచకాలు సహించలేని హిమచల్ ప్రదేశ్ ప్రజలు బిజెపిని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు.గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలున్నప్పటికీ దేశ ప్రధాని, దేశ అధికార యంత్రాగం గుజరాత్ లో మోహరించి అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు ప్రచారంతో విజయం సాధించిన బిజెపిది గుజరాత్ లో నైతిక గెలుపు కాదు.

ఎన్నికల ప్రచారంలో మోడీ ప్రధాని స్థాయి మర్చిపోయి గుజరాత్ ప్రతినిధి లా మాట్లాడారు.డబ్బు, అధికారం, మీడియాలో తప్పుడు ప్రచారం చేసి గుజరాత్ లో బీజేపీ విజయం సాధించింది.దేశ వనరులు అన్ని గుజరాత్ లో కుమ్మరించారు. దేశ సందపను దోచిపెట్టిన క్రోని క్యాప్టలిస్టులను గుజరాత్ లో మోహరించి ఆనేక ప్రలోభాలు పెట్టి గెలిచిన విజయం గెలుపు ఎట్లా అవుతుంది.

బీజేపీపై నమ్మకంతో గుజరాతీలు ఓట్లు వేసినట్లుగా కనిపించడం లేదు.ఎంఐఎం, ఆప్ లాంటి పార్టీలను బీజేపీ ప్రోత్సహించి లౌఖికవాద ఓట్లు చీల్చి గుజరాత్ లో గెలిచారు. ఆప్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నట్లుగా మీడియా లో బిజెపిలో ప్రచారం చేయించి లబ్ధి పొందారు.ఒక ప్రధాని తన స్థాయిని దిగజార్చుకొని ఓక ఎన్నిక కోసం ఒక రాష్ట్రంలో 36 సభలకు పైగా పాల్గొన్న దుష్టాంతం దేశంలో ఇప్పటి వరకు చూడలేదు. దేశాన్ని పాలించే ప్రధాని దేశాన్ని ఒకే విధంగా చూడాలి తప్పా ఒక ప్రాంతం వాడి కుంచిత సంకుచిత మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండకూడదు. తాను భూమి పుత్రిడిని అంటూ గుజరాత్ లో మోడీ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందారు.

ఎంఐఎం, ఆప్ పార్టీలు బీజేపీ ట్రాప్ లో పడి గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ కి సహకరించాయి.కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధి చేపట్టిన భారత్జోడో యాత్ర ఎన్నికల కోసం చేసే యాత్ర కాదు. దేశ విచ్చిన్నకర శక్తులను నుంచి దేశాన్ని ఐక్యం కొరకు చేస్తున్న పాదయాత్ర.ముందుస్తుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే రాహుల్ పాదయాత్ర నడుస్తున్నది.

గుజరాత్ ఓటమికి మొన్ననే కాంగ్రెస్ అధ్యక్షుడిగా భాద్యతలు చేపట్టిన ఖర్గే భాధ్యుడు కాడు. గుజరాత్ ఓటమికి కాంగ్రెస్ మొత్తం భాధ్యత వహించాలి.కాంగ్రెస్ పార్టీలో కమిటీల నియామకంపై కసరత్తు జరుగుతుంది. కమిటీల ఏర్పాటుపై నా అభిప్రాయం కూడా నేను చెప్పాను.సీనియారిటీ, అనుభవం క్రైటిరియా ప్రకారమే కమిటీల్లో స్తానం కల్పించాలని చెప్పాం.కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా పార్టీలోనే ఉన్నారు. క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇచ్చింది. వెంకట్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉన్నారు.

తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనలకు భిన్నంగా సజ్జల కామెంట్స్ ఉన్నాయి.మళ్ళీ సమైక్య రాష్ట్ర నినాదం అనే వాదనతో ఉపయోగం లేదు.తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యాఖ్యలకు వ్యతిరేకం. గుజరాత్ లో గెలుపు స్పూర్తితో తెలంగాణలో గెలుస్తామని బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాక్యాలు హాస్యస్పదంగా చూడాలి. రాజకీయ, ఆర్ధిక, సామాజిక పరిస్థితుల్లో మార్పులు తీసుకురాకుండ అధికారంలోకి వస్తే చాలు అనుకునే సంజయ్ ఎప్పుడు అధికారం కోసం వెంపర్లాడినట్టుగానే ఆయన వ్యాఖ్యలు ఉంటాయి.