Suryaa.co.in

Andhra Pradesh Telangana

సైనికులతో మోదీ దీపావళి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సారి కూడా సైనికులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. ఇందుకోసం ఆయన ఆదివారం ఉదయం చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నారు.. అక్కడున్న దేశ భద్రతా బలగాలతో ప్రధాని దీపావళి వేడుకులు జరుపుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వెల్లడించారు. ”మన ధైర్యమైన భద్రతా దళాలతో దీపావళి జరుపుకోవడానికి హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చా చేరుకున్నాను.” అని ట్వీట్ చేశారు. శనివారం దేశ ప్రజలందరికీ మోదీ దీపావళి సందేశం ఇచ్చారు..

దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మోదీ అందరూ అద్భుతమైన ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. “ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, శ్రేయస్సు, అద్భుతమైన ఆరోగ్యాన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను” అని ఆయన అన్నారు. కాగా దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో దీపావళి పండుగ జరుపుకోవడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇది కొత్తేం కాదు..

ఇది ఆయన చిరకాల సంప్రదాయంగా వస్తోంది. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన ప్రతి సంవత్సరం సాయుధ దళాలతోనే దీపావళి పండుగను జరుపుకుంటున్నారు. ప్రతి దీపావళికి సైనికులు ఉండే మారుమూల ప్రాంతాలకు వెళ్లి, వారి త్యాగాలకు కృతజ్ఞతలు తెలిపి, వారితో పండుగ జరపుకుంటున్నారు. ప్రస్తుతం సైనికులతో ప్రధాని దీపావళి జరుపుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి..

 

LEAVE A RESPONSE