– ఆరోజు మీరు శాసనసభలో ఎందుకు బహిష్కరించ లేదు?
– అసలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు.. ప్రధాని కూడా దొంగ అవుతారు
– ఈ చట్టాన్ని డ్రాప్ చేసేద్దాం అని ప్రధానికి చెప్పండి
– భూములు కొట్టేయడానికే ఈ చట్టాన్ని తెచ్చారు అంటే.. అప్పుడు చట్టాన్ని అంగీకరించిన మీరందరూ దొంగలే
– ప్రజలకు చెప్పటం కాదు…మోడీకి చెప్పండి.. ప్రధాని ఇలాంటి చట్టం తేవడం తప్పని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పగలరా?
– సర్వే రాయి మీద ఒక బొమ్మ వేస్తే భూములు కొట్టేయడం అవుతుందా ?
– భూములు కొట్టేయడానికి మన రాజ్యాంగం అంగీకరిస్తుందా?
– ఇదే లేటెస్ట్ సర్వే అని చెప్పటానికి సర్వే రాళ్లపై జగన్ బొమ్మ వేశాం
– మేము తెచ్చినవే మీరు అమలు చేస్తున్నారు
– మ్యుటేషన్ విధానం, స్లాట్ విధానం మేము తెచ్చాము
– పాస్ బుక్ మీద ఉన్న అట్ట తీసేసి మీరొక అట్ట వేశారు
– మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం: కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వం నడుపుతున్న మంత్రులు, ప్రభుత్వ అధినేతలు కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. టైట్లింగ్ యాక్ట్ అనేది ఎవరి ఇనిషియేషన్ వల్ల వచ్చింది అని అడుగుతున్న. దేశంలో 1989 నుంచి ఒక అధ్యయనం జరుగుతుంది. అధ్యయనం సారాంశం ఏంటి? ఈ దేశంలో స్పష్టమైన టైటిల్ ఇచ్చే చట్టం లేదు. దేశంలో అనేకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి.. దేశ అభివృద్ధికి, ఇన్వెస్ట్మెంట్ కూడా తీసుకురావడం కష్టం అవుతుంది.
ఇతర దేశాల నుంచి ఈ దేశంలో పెట్టుబడి పెట్టాలనుకున్న పారిశ్రామికవేత్తలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈనాటి వరకు కూడా దేశంలో ఉన్న రెవెన్యూ చట్టం ఏంటి? ప్రజెంట్ యాక్ట్ అంటే నీకు ఈ భూమి కలిగి ఉన్నావని ప్రెజెంటేషన్ తప్ప, టైటిల్ నీకే ఉందని స్పష్టంగా చెప్పే యాక్ట్ దేశంలో లేదు. లేకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం గడిచిన 40 సంవత్సరాలుగా అధ్యయనం చేస్తుంది ఏం చేయాలి అని. దానికి ఒక కమిషన్ వేశారు, అనేక రిపోర్టులు తెప్పించారు, ప్రపంచంలో ఇతర దేశాలు టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన విధానాన్ని అధ్యయనం చేశారు. చివరిగా బిజెపి ప్రభుత్వం నీతి ఆయోగ్ కి రిఫర్ చేసింది. అధ్యయనాల తర్వాత నీతి అయోగ్ ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది. అదే టైట్లింగ్ యాక్ట్ డ్రాఫ్ట్. అంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు చట్టం చేయలేదు? ఎందుకంటే భూమి అనే వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం జాబితాలో ఉంది కనుక. భూమి అనే చట్టం శాసనసభలో చేయాలి.
దేశంలో ఉన్న అన్ని శాసనసభలకు ఈ డ్రాఫ్ట్ ను చట్టం కింద చేయమని రాష్ట్రాలకు పంపించడం జరిగింది. అంటే ఈ రాష్ట్రానికి వచ్చిన చట్టం డ్రాఫ్ట్ ఎవరి వద్ద నుంచి వచ్చింది? నాడు నేడు ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం, నరేంద్ర మోడీ అధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం!
ఈ చట్టం తీసుకొచ్చింది దేశ ప్రయోజనం కోసం, దేశంలో అభివృద్ధి కోసం, దేశంలో ఉండే భూమి గల వారి హక్కుల్ని రక్షించడం కోసం. ఈ దేశంలో గ్రామాల్లోని ఉండే వివాదాలకు కారణమైనటువంటి ప్రశాంతమైన జీవితాన్ని సాగడం కోసం, దశాబ్దాల తరబడి కోర్టులో నలిగిపోతున్న వంటి భూమి హక్కుదారులకు రక్షణ కల్పించడం కోసం..
ఈ చట్టం శాసనసభలో అప్రూవ్ అయింది. ఆనాడు తెలుగుదేశం శాసన సభ్యులు కూడా శాసనసభలో ఉన్నారు. ఈ చట్టం చూడలేదా? ఆరోజు ఎందుకు మీరు శాసనసభలో బహిష్కరించ లేదు? ఆనాడు చట్టం చేయబడిందంటే ఆ చట్టాన్ని అంగీకరించిన మీరు కూడా దొంగలే కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం మీరు దొంగలే అవుతారు. అసలు రాష్ట్ర ప్రభుత్వమే కాదు ప్రధాని కూడా దొంగ అవుతారు.
భూములు కొట్టేయడానికి చట్టం తెచ్చారని ముఖ్యమంత్రి, క్యాబినెట్లో మంత్రులు మీరు మాట్లాడితే ఏమన్నా అర్థం ఉందా? ఈ చట్టాన్ని చూసే మాట్లాడుతున్నారా? తెలియక మాట్లాడుతున్నారా? మోసగించడానికి మాట్లాడుతున్నారా? మీకు మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రభుత్వంలో ఉన్న ఒక వ్యక్తి చట్టం గురించి ఇలా మాట్లాడొచ్చా?
నేను అడుగుతున్నా.. మిమ్మల్ని దేశంలో ఒకరి ఆస్తి ఇంకొకరు లాగేసుకోవడానికి మన రాజ్యాంగం అనుమతి ఇస్తుందా? పాస్ బుక్ మీద బొమ్మ ఉంటే భూమి లాగేసుకుంటారు అని ఒక క్యాబినెట్ మంత్రి చెప్తుంటే.. ఈ రాష్ట్రంలో ఉన్న విజ్ఞానులు ఏమైపోయారు? ఈ రాష్ట్రంలో ఉన్న న్యాయవాదులు ఏమైపోయారు? ఈ రాష్ట్రంలో చట్టం తెలిసినటువంటి చైతన్యవంతులు ఏమైపోయారు?
ప్రధానమంత్రి ఈనాడు కేంద్ర ప్రభుత్వం లో ఉన్న ప్రభుత్వం తో మీరు కలిసి పోటీ చేసిన ప్రభుత్వం తెచ్చిన చట్టం ని, ఇంకోచోట ఆ చట్టం దొంగది, భూములమ్ముకోవడానికి అని చెప్తున్నారు. అసలు మీరు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోండి. అసలు ప్రజలకు చెప్పడం ఎందుకు మీరు ప్రధానమంత్రిని అడగండి. ఈ చట్టాన్ని డ్రాప్ చేసేద్దాం అని చెప్పండి. నీతి ఆయోగ్ ఇచ్చిన డ్రాఫ్ట్ దొంగ డ్రాఫ్ట్ ప్రజల ఆస్తులను కొట్టేయడానికి ఉపయోగపడే డ్రాఫ్ట్ అని అతనికి చెప్పండి మీరు. చెప్పగలరా? ఖండించగలరా? ప్రధానమంత్రి చట్టం తేవడం తప్పు అని మీ ముఖ్యమంత్రి చెప్పగలరా. చెప్పలేడు.
ఇంకో మంత్రి చెప్తాడు సర్వే స్టోన్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఆ భూముల్ని దొబ్బేయాలనుకుంటున్నాడు అని, ఏంటి మీ మాటలు? సర్వే స్టోన్ పైన బొమ్మ ఉన్నంత మాత్రాన భూమిని కొట్టేయడానికి అవకాశం ఉందా? ఎందుకు ఆనాడు బొమ్మ వేశారంటే మీకు అది అబ్జెక్షన్ కావచ్చు . కానీ ప్రభుత్వం తాలూకా ఆలోచన ఏంటి? 100 సంవత్సరాలుగా సర్వే జరగలేదు. అంటే మన ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మనకి స్వాతంత్రం లభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సమగ్రమైనటువంటి సర్వే చేయలేదు.
మన దగ్గర ఉన్న రికార్డ్ బ్రిటిష్ వారి హయాంలో రికార్డ్స్ ఉన్నాయి. సర్వే అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కనక, చాలా సుదీర్ఘమైనటువంటి కాలం గనుక ధనాన్ని పెట్టుబడి పెట్టాలి కనుక టెక్నాలజీని ఎడాప్ట్ చేసుకోవాలి కనుక ఒకసారి చేయలేకపోవచ్చు అన్ని ప్రభుత్వాలు వైఫల్యం చెందాయి మీరు కూడా నాలుగు సార్లు ఐదుసార్లు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మీరు కూడా చేయలేకపోయారు. ఈనాడు సక్సెస్ ఫుల్ గా ఒక సర్వే రాష్ట్రంలో చేసే అవకాశం వచ్చింది.
సర్వే అంటే ఏంటి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ ముత్తాతలు నుంచి ఉన్నటువంటి భూములను ఎవరున్నారు? ఏమన్నారు? ఎవరికి చెందింది? దాని హద్దులు ఏంటి ఇవన్నీ నమోదు చేసేదే సర్వే. ఆ సర్వే చేసినప్పుడు ఇంతకాలంగా ప్రైవేట్ వ్యక్తులే బ్రిటిష్ వారు వేసిన రాళ్లు రకరకాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కాలంలో చేసినటువంటి సర్వే రాయి ఎక్కడుంది. అదే లేటెస్ట్ సర్వే తర్వాత కాలం వారు అనుకోవటానికి ఆ బొమ్మ వేసి పెట్టాము.
జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది కదా అని రాజకీయ ప్రత్యర్థులుగా మీరు దానికి బాధపడవద్దు. ఆ బొమ్మ ఉన్నంత మాత్రాన భూమి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అయిపోతుందా? ఎవరైనా చెప్పండి ధైర్యంగా ప్రెస్ ముందుకు వచ్చి చెప్పండి. ఈ చట్టం చెప్తుంది ఈ బొమ్మ ఉండటం వల్ల, ఆ బొమ్మ ఉన్నవాళ్ళకి వెళ్ళిపోతుంది. పాస్ బుక్ మీద ఎవరు బొమ్మంటే వారికి వెళ్ళిపోతుంది అని మీరు చెప్పండి.
టైటిలింగ్ యాక్ట్ కు సంబంధించి నిన్ననే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా డీటెయిల్స్ చెప్పారు ఇంకా అవసరమైతే నేను చెప్తా. మేము తెచ్చిన విధానాలను, మేము అమలు చేసినటువంటి విధానాలను మీరు కొనసాగిస్తూనే, అన్ని మేము తెచ్చామని అబద్ధాలు ఆడుతున్నారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి అధికారులు సరిగ్గా బ్రీఫ్ చేయలేదు. లేదా ఏమీ చేయలేమని భయపడి గడిచిన ప్రభుత్వం చేసిందని చెప్పడానికి సిగ్గుతో అబద్ధాలు ఆడుతున్నారేమో కానీ, ఆటోమేటిక్గా మ్యుటేషన్ వంటి పద్ధతులను మేము తీసుకొచ్చాము.
ల్యాండ్ పార్సిల్ మ్యాప్ ఉంటే తప్ప, రిజిస్ట్రేషన్ రాకూడదని స్మార్ట్ విధానం డిజిటల్ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ మేం తెచ్చాము గ్రామస్థాయిలో సబ్ రిజిస్టర్ కార్యాలయం విధానాన్ని మేము తెచ్చి అమలుపరిచాము. పాస్ బుక్ లో తప్పన్నారు ఏం తప్పు వాటి మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బొమ్మ అట్ట తీసేసారు. మీరు ఇంకొక అట్ట తగిలించారు. ఈ దేశంలో రైతు ప్రాపర్టీ యాక్ట్ అనే రాజ్యాంగ చట్టం ఉండగా, అడ్డుగోలుగా తీసుకోవడం వీలు పడదు.