Suryaa.co.in

Andhra Pradesh

మోదీ మాట ఇచ్చారు..వచ్చారు: కిషన్ రెడ్డి

మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు వస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట ఇచ్చారని, ఇచ్చిన మాటకు కట్టుబడి భీమవరం వచ్చారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరుగుతున్న అల్లూరి జయంత్యుత్సవాలకు మోదీ, ఏపీ గవర్నర్ హరిచందన్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడ్డ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు ప్రజల తరఫున ఆయనకు స్వాగతం పలికారు. ఏడాదంతా ఈ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. అల్లూరి నడయాడిన దేశంలోని వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుపుతామన్నారు. ఈ ఏడాదంతా అల్లూరి పేరు మారు మోగాలన్నారు. భీమవరంలో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించారు. అల్లూరి వారసులను సన్మానించారు.

LEAVE A RESPONSE