Suryaa.co.in

National

కీవ్ లో మహాత్ముడికి మోడీ నివాళి

కివ్‌: ప్రధాని నరేంద్రమోదీ కీవ్‌లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఏవీ ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో 2020లో నెలకొల్పిన జాతి పిత విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి బాలల స్మారకం, జాతీయ మ్యూజియాన్ని సందర్శించారు. 20, 21వ శతాబ్దాల్లో ఉక్రెయిన్ పౌరులు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిపిన పోరాట చిహ్నాలు అక్కడ ఉన్నాయి.

LEAVE A RESPONSE