Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

  • సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు…
  • ఏడిద గ్రామ సభలో ఎమ్మెల్యే వేగుళ్ళ…

వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు విమర్శించారు. మండపేట మండలం, ఏడిద గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా నిర్ణయాలకు గ్రామసభలతో శ్రీకారం చుట్టి వారికి జవాబుదారీగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జగన్ పాలనలో సర్పంచుల ను సైతం లెక్కచెయ్యని దుస్థితిని చూశామని అన్నారు. కేంద్రం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను సైతం మాజీ సీఎం స్వాహా చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.

జగన్ ప్రభుత్వం గ్రామపంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో గ్రామాల్లో ఒక సీసీ రోడ్డు కూడా వేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యమని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులతో గ్రామాల దశ మారిపోతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రతీ గ్రామంలో చేయవలసిన పనులు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యం గా సి.సి.రోడ్లు, డ్రైన్లు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఏడిద గ్రామంలో ఎప్పటినుండో సమస్యగా ఉన్న దేవుడు కాలనీలోని డ్రైన్లు అభివృద్ధి చేసేందుకు సుమారు రూ.1.48 కోట్లు నిధులతో పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. అలాగే రూ. 60 లక్షలతో ఏడిదలో వివిధ చోట్ల సి.సి.రోడ్లు నిర్మాణానికి ప్రతిపాదనలు ఆమోదించామన్నారు.

గ్రామాల అభివృద్దితోనే రాష్ట్ర, దేశాభివృద్ది సాధ్యమని తమ ప్రభుత్వం ఈ గ్రామ సభలను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామసభల ద్వారా ప్రజలందరికీ ఉపాధి హామీ పథకంపై అవగాహన కల్పించి నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE