– బీజేపీ దేశానికి, రాష్ట్రానికి ఏమి చేయలేదు..
– కేంద్రంలో ఇంత ఘోరమైన పార్టీ ఎప్పుడూ చూడలేదు
– వైసీపీ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య ప్రెస్ మీట్
ప్రధాని మోడీ నల్లధనాన్ని బయటికి తిస్తామని ప్రజలను నమ్మించారు. 2014 ఎన్నికల కు ముందు స్విస్ బ్యాంక్ నుంచి నల్ల ధనాన్ని తెచ్చి ప్రజల అకౌంట్లలో 15 లక్షలు వేస్తామని మోసం చేసిన మోడీ. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల ఇస్తామని మోసం.ఫెడరల్ స్ఫూర్తి ని మంటకలిపి రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బిజెపి.నిత్యావసర ధరలు తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు.మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీ.
రాష్ట్రానికి ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చని కేంద్రం.కడప ఉక్కు, విశాఖ ఉక్కు విషయంలో మాట నిలబెట్టుకోలేదు.కోవిడ్ లో ప్రయివేటు కంపెనీలకు లాభం చేకూర్చేలా కేంద్ర నిర్ణయాలు.కోవిడ్ లో వలస కార్మికుల పట్ల కనీసం కనికరం చూపని బిజెపి.
మతపరమైన పాలనలో బీజేపీ దిట్ట.వ్యవసాయ చట్టాల్లో రాష్ట్రాల సూచనలు పరిగణలోకి తీసుకోకుండా చట్టాలు.కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారి పై ఈడీ సోదాలు, దేశ ద్రోహం కింద కేసులు.స్వదేశీ జాగరణ అని పిలుపునిచ్చిన బీజేపీ. ప్రభుత్వ సంస్థలన్నీ ప్రయివేటికరణ చేయాలని కేంద్రం చూస్తుంది.
ఆదాని, అంబానీలకు లభ్ది చేకూరేలా మోడీ నిర్ణయాలు.బీజేపీ ప్రభుత్వం లో ఆర్థిక రంగం కుదేలయ్యింది.ప్రజలు ఇంకా కరోనా మహమ్మారి నుంచి బయటపడలేదు.క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా కూడా పెట్రో, డీజల్ ధరలు అమాంతం పెంచుతున్న కేంద్రం.ప్రజల్లో వ్యతిరేకత వస్తున్న తరుణంలో పెట్రో, డీజల్ పై రేట్లు తగ్గించిన కేంద్రం.రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుంది. రాష్ట్ర బీజేపీ నాయకులు కేంద్రం వద్దకు సమస్యలను తీసుకెళ్లే సత్తా లేదు.
ప్రజల బాగోగులు పట్టని బీజేపీ కి రాష్ట్రంలో ఉండే హక్కు లేదు.విశాఖ ఉక్కు కాపాడుతమని రాష్ట్ర బీజేపీ ప్రజలను మోసం చేస్తుంది.రాష్ట్రాల పైన బరువు పెట్టి తమాషా చూస్తున్న కేంద్రం. ఏపీ బీజేపీ నేతలు పెట్రో, డీజల్ పై సెస్ తగ్గించాలని కేంద్రాన్ని కోరాలి.