చీమకుర్తి హరిహర క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన శిద్దా రాఘవరావు

కార్తీక మాసం సందర్భంగా చీమకుర్తి హరిహర క్షేత్రంలో విశేష పూజలు ఘనంగా జరిగాయి.మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఆలయంలో వేంచేసివున్న దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్వతి సమేత శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి శిద్దా రాఘవరావు విశేష పూజలు కార్తీక దామోదర ప్రీతర్ద్యం పరమశివునికి లక్ష వత్తుల పూజ కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.కార్తీక సోమవారం పునస్కరించుకొని హరిహర క్షేత్రంలో మహిళలు దీపాలు వెలిగించి పరమ శివుని దర్శనం చేసుకున్నారు.శిద్దా వెంకటేశ్వర్లు వెంకట సుబ్బమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.