Suryaa.co.in

Telangana

చెప్పులు వేసుకునే సామాన్యుడు కూడా విమానం ఎక్కాలన్నదే మోడీ కల

– కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా

హైదరాబాద్: 75 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో ప్రస్తుతం అమృత కాల్ కు చేరుకున్నాం. 2047 నాటికి ప్రపంచంలోనే సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.

ప్రధాని నరేంద్ర మోదీ గత పదేండ్లుగా ప్రజాస్వామ్యయుతంగా, సుపరిపాలన అందిస్తూ భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకుతీసుకెళ్తున్నారు.

నరేంద్ర మోదీ పాలనలో భారత్ ప్ర‌పంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్య‌వ‌స్థ‌గా ఎదిగింది. 2030 నాటికి 3వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా మోదీజీ పాలన అందిస్తున్నారు.

హవాయి జహాజ్ లేదా విమానంలో ప్రయాణించడానికి ‘ హవాయి చప్పల్ ‘ (చెప్పులు) ధరించే వ్యక్తిని చూడాలనేది ప్రధాని నరేంద్ర మోదీ కల.ప్రధాని మోదీ ఉడాన్ స్కీమ్ తో సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం చేరువయ్యేలా చేశారు.

సాధారణ పౌరుడికి కూడా విమాన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ప్రధాని సంకల్పించారు. ఆ దిశగా సరలీకరిస్తున్నారు.ఉడాన్ పథకం కింద 517 మార్గాలు ప్రారంభమయ్యాయి, 9 హెలిపోర్ట్‌లు & 2 వాటర్ ఏరోడ్రోమ్‌తో సహా 76 విమానాశ్రయాలను కలుపుతూ విమానయాన సేవలు కొనసాగుతున్నాయి. అనేక విమానశ్రయాలను పునరుద్ధరించడంతో పాటు మౌలిక వసతులు కల్పించడం జరుగుతోంది.

ప్రాంతీయ పౌర విమానయాన మార్కెట్‌ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది. 2047 నాటికి భారతదేశం అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించనుంది.మూడవ అతిపెద్ద దేశీయ మార్కెట్/ ఏడవ అతిపెద్ద అంతర్జాతీయ మార్కెట్ గా భారత్.. ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద విమానయాన మార్కెట్‌గా అవతరించింది.

2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నాం. పదేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. ముంబయి, దిల్లీలో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చాం. వేగవంతమైన కనెక్టివిటీతో ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తున్నాం.

దేశంలో 500 కొత్త ఇండిగో విమానాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చాం.మానవవనరుల కోసం పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా ఎయిర్ క్రాప్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ కోర్సులను బోధించగలిగేటువంటి ఏవియేషన్ స్కూల్ అయిన జీఎంఆర్ స్కూల్ ఆఫ్ ఏవియేషన్ ను హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది.

బేగంపేట విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రమాణాలతో ‘పౌర విమానయాన పరిశోధనా కేంద్రం రూపుదిద్దుకుంటోంది. దేశంలో అన్ని రంగాల్లో భారతదేశం అభివృద్ధి చెందేలా నరేంద్ర మోదీ గారు సుపరిపాలన అందిస్తున్నారు.

LEAVE A RESPONSE