-కేంద్ర ప్రభుత్వంపై ప్రభుత్వ రంగ సంస్థల ట్రేడ్ యూనియన్స్ సమర శంఖారావం
-ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ట్రేడ్ యూనియన్స్ జే.ఏ.సీ. ఏర్పాటుకు నిర్ణయం
– త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఖరారు
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల నాయకుల సమావేశం
– కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కటైన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ఉద్యోగ సంఘాలు
– మోడీ సర్కార్ పై అలుపెరుగని పోరాటం కొనసాగిస్తాం
– రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టీకరణ
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేందుకు ఎంతటి పోరాటాలకైనా సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు. ఆదివారం మంత్రుల నివాసంలోని క్లబ్ హౌస్ లో ప్రభుత్వ రంగ సంస్థల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులతో వినోద్ కుమార్ సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో బీ.ఎస్.ఎన్.ఎల్, ఎల్.ఐ.సీ, బీడీఎల్, హెచ్.ఏ.ఎల్, బీ.హెచ్.ఇ.ఎల్, రైల్వే, హెచ్.ఎం.టీ – ప్రాగా టూల్స్, మిధాని, డీ.ఆర్.డీ.ఎల్, ఇ.సీ.ఐ.ఎల్, మింట్, పోస్టల్, డీ.ఎల్.ఆర్.ఎల్, పలు బ్యాంకులు, పలు ఇన్సూరెన్స్ సంస్థల అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వానిది మేకిన్ ఇండియా కాదు, సేల్ ఇన్ ఇండియా పాలసీ అని విమర్శించారు. సేవ్ పీ.ఎస్.యూ – సేవ్ ఇండియా నినాదంతో ప్రజల్లోకి వెళతామని ఆయన అన్నారు.ఈ సమావేశం నుంచి కేంద్ర ప్రభుత్వంపై సమర శంఖారావాన్ని పూరిస్తున్నట్లు వినోద్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అయిన ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ.. వాటిని ప్రైవేటు పరం చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని వినోద్ కుమార్ ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదన్నారు.
కేంద్రం ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ చేయడం అంటేనే రిజర్వేషన్లు తీసివేయడమేనని ఆయన అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, వర్గాలకు ఉద్యోగాలు దక్కకుండా మోడీ ప్రభుత్వం మోసపూరితంగా పావులు కదుపుతోందని వినోద్ కుమార్ ఆరోపించారు.
ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించడంతో బిసి ఎస్సి,ఎస్టీ లకు ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోయే పరిస్థితులు రానుందని పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో ఒక్క హైదరాబాద్ లోనే దాదాపు ఒక్క లక్ష యాబై వేల మంది పని చేస్తున్నారని అన్నారు.రక్షణ శాఖను సైతం ప్రైవేట్ కు అమ్మేందుకు ప్లాన్ చేస్తోంది ఈ కేంద్రం అని అన్నారు.మిధని ,బిడిఎల్,ఆర్డినెన్స్ సంస్థ లను కూడా అమ్ముతున్నారు. అబ్దుల్ కలాం ఇక్కడ అనేక పరిశోధనలు చేశారని అన్నారు.
ఎల్ఐసి ని కూడా అమ్ముతున్నారు. దీనితో పేదలకు భీమా సౌకర్యం మరింత ప్రీమియం కానుంది.
ఆనాడు ఎల్ ఐ సి కాకుండా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపని లు వచ్చి నప్పుడే చెప్పాము ఇవాళ ఎల్ ఐ సి ని తట్టుకొని ఉండే పరిస్థితి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపని లేక మోదీ ని మ్యానేజ్ చేసి ఎల్ ఐ సి అమ్మేయలని అంటున్నారు అని ఆయన తెలిపారు.ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రజలు నమ్ముత లేరు కాబట్టే ఉన్న ఎల్ ఐ సి అమ్మాలని చూస్తున్నారు.ప్రభుత్వ రంగ సంస్థలకు ఆస్తులు ఉన్నాయి కాని ప్రైవేట్ సంస్టులకు ఆస్తులు ఎక్కడివి అని ఆయన ప్రశ్నించారు.
బ్యాంక్ లను అమ్మాలి ప్రైవేట్ బ్యాంక్ లను ప్రోత్సహించాలి ఇదే మోడీ నినాదం. కొత్తవి పెట్టడు కానీ ఉన్నవి అమ్ముతారు ఈ మోడీ ప్రభుత్వం అని అన్నారు.ప్రభుత్వ సంస్థలను అమ్మడమే బీజేపీ ఫిలాసఫీ అని ఆ పార్టీ పెట్టినప్పుడే లోక్ సభలో బీజేపీ నాయకులు పలు సందర్భాల్లో మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయద్దు అని ఈరోజు జరిగిన ఈ సమావేశంలో తీర్మానం చేయడం చాలా సంతోషం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మీరు చేసే ఉద్యమం దేశానికి చూపించాలి అని వినోద్ కుమార్ పేర్కొన్నారు.సంవత్సరానికి కోటి ఉద్యోగాలు అన్నారు మోడీ గారు ఎక్కడ పోయాయి. ఉన్న ఉద్యోగాలనే తీసేస్తున్నాడు ఈ ప్రధాని మోదీ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్
ప్రైవేటీకరణ చేస్తాం అని నాడు పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రయత్నం చేసింది కానీ నాడు ప్రభుత్వం కూలిపోయింది. ఈ 7 యేండ్ల కాలంలో 37 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మారు ఈ మోడీ గారు. కార్మికుల సమ్మె చేస్తే తొలగించేందుకు బిల్లు తెచ్చారు దానితో కార్మికులు సమ్మె చేస్తే నిర్ధ్యక్ష్యంగా ఉద్యోగుల తొలగించేది. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టింది ఈ మోడీ ప్రభుత్వం.
ప్రజలు ఆత్మగౌరవం తో బ్రతకాలి అనేది మన నినాదం.మోడీ ప్రభుత్వం ది మేకిన్ ఇండియా కాదు సెల్ ఇన్ ఇండియా. డిజిటల్ ఇండియా తో ఆర్ధిక వ్యవస్థ లో ఎలాంటి మార్పులు లేవు.ఎన్నికల కోసమే నోట్ల మార్పు చేశారు ఈ మోడీగారు. యూపీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల డబ్బులను కొల్లకొట్టేందుకు ఈ పెద్ద నోట్ల మార్పు తెచ్చారు దీనితో ఎం ఒరిగింది. ఆర్ధిక శాఖలో ఓనమాలు తెలువని వ్యక్తి దేశ ఆర్థిక శాఖ మంత్రి,దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుంది.
రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న అభివృద్ధి ని ఓర్చుకోవడం లేదు.కంటోన్మెంట్ రోడ్లను మూసి వేస్తుంది ప్రజలను ఇక్కట్లకు గురి చేస్తుంది. సబ్ కా సాత్ అంటే యూపీ రాష్ట్రం ఒక్కటే కాదు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఒక రోల్ మాడల్….ఆర్టీసీ ని అమ్మకోండి అని మనకు లేఖ రాశారు కానీ మేం అమ్ముకోలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను 3 సంవత్సరాలలో ఎక్కడైనా కడుతారా… మన తెలంగాణ బిడ్డలే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది.
ప్రభుత్వ రంగ సంస్థలను బ్రతికించికోవడం కోసమే కదా బీహెచ్ ఎల్ సంస్థకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలను మనం తిప్పి కొట్టాలి.ఈ సమావేశంలో టీ.ఆర్.ఎస్. కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్, రూప్ సింగ్, రాజారాం యాదవ్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ సంఘాల నాయకులు సత్విందర్ సింగ్, దాన కర్ణ చారి, యాదవ రెడ్డి, రాజిరెడ్డి, విఠోబ, వెంకటేశ్వర్లు, సాంబశివరావు, భాస్కర్ రెడ్డి, రవికుమార్, రమేష్, రాదేశ్యామ్, నాగ మోహన్, సుందర్, సత్యనారాయణ, సురేందర్, శ్రీనివాస్ గౌడ్, చెన్నయ్య, యాకయ్య, నరేందర్ , తదితరులు పాల్గొన్నారు.