అమీర్‌పేట ఆసుపత్రి అలంకారప్రాయమేనా?

– అందుబాటులో తెచ్చే ఆలోచన ఉందా?
– మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన

నగర నడిబొడ్డున ఉన్న అమీర్పేట లోని ప్రభుత్వ బస్తీ దవాఖానను సుమారు నాలుగు నెలల క్రితం 50 పడకల ఆసుపత్రి ని అంగరంగ వైభవంగా ప్రారంభించారు.వందల కోట్ల రూపాయల తో స్థాపించిన ఈ ఆసుపత్రి కి, బయట ఆర్భాటం తప్ప ఆసుపత్రి లోపల పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడం, సరైన మౌలికమైన వసతులు లేకపోవడం నిజంగా శోచనీయం. ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా సార్లు స్పష్టం చేశారు. కానీ ఆ మాటలు ఆచరణలో లేకపోవడం వైద్య శాఖ. వైఫల్యం గా కనిపిస్తుంది అని తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన తెలిపారు.

వైద్యరంగంలో తెలంగాణ ఆదర్శంగా నిలబడాలి అంటే ఇటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు కల్పించి, అన్ని విభాగాల వైద్యులను అందుబాటులో తెస్తే తప్ప పేద ప్రజలకి అందుబాటులో నాణ్యమైన వైద్యం రాదు.కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆసుపత్రిలు వాటి నిర్వహణ పై కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు. అందుబాటులో ఉన్న ఆసుపత్రి లను పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చి సరైన వైద్యం సేవలు అందించాలని కోరారు వాటికి అనుకూలంగా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నా.

మళ్ళీ ఈ మధ్య కాలంలో కరోన అనే మహమ్మారి తన రూపాంతరము మార్చుకొని కరాళనృత్యం చేస్తుంది.. కానీ పేద ,బడుగు బలహీన వర్గాలకు మాత్రం వైద్యం అందుబాటులో లేకపోవడం తో పేద ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైన ప్రభుత్వ, వైద్య శాఖ అధికారులు తక్షణమే స్పందించి అన్ని
ameerpet వసతులు ఏర్పాటు చేసి సరైన వైద్యాన్ని అందుబాటులో తేవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా …
ఈ దవాఖానా ఏర్పాటుతో లక్షలాది మందికి ఉపశమనం కలుగుతుందని చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నా. మా సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో రావడం చాలా సంతోషం అని ఆనందపడేలోపు ,అందుబాటులో సరైన వైద్య పరికరాలు ,మౌళిక వసతులు లేకపోవడంతో ,సంతోష పాడలో బాధపడలో అర్ధం కావడం లేదు.

అమీర్‌పేట లో ఈ ప్రభుత్వ ఆసుపత్రి ఏర్పాటు చేయడం కేవలం ఒక్క సనత్ నగర్ నియోజకవర్గ ప్రజలకే కాదు చుట్టూ పక్కల ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ మూడు నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు మంచి వైద్యం అందిచే అవకాశం ఉంది .ముఖ్యంగా ఆసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ త్వరగతిన ఏర్పాటు చేసి తక్షణమే వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తున్న ఆసుపత్రి ని నేను ప్రత్యక్షంగా పర్యవేక్షణ చేసి ప్రభుత్వ వైద్య శాఖ కి ఇక్కడ లోపాలు తెలియచేస్తున్నా.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మహిళ ప్రధాన కార్యదర్శి సూర్యదేవర లత, వాహీద్, శ్రీనివాస్ యాదవ్, స్థానిక ప్రజలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply