Suryaa.co.in

Telangana

కేంద్రంలో మూడోసారి మోదీ ప్రధాని ఖాయం

-హైదరాబాద్‌ను అన్ని విధాలా అభివృద్ధి చేశాం
-తెలంగాణలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తాం

-సికింద్రాబాద్‌ పర్యటనలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

 రానున్న ఎన్నికల్లో మోదీ ప్రధాని కావటం ఖాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే 13న తెలంగాణలో నాలుగో దశలో ఎన్నికలు జరుగుతాయి…మోదీకి ఓటు వేయాలని దేశమంతా నిర్ణయించుకుంది…తెలంగాణలో అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటామన్నారు. కాంగ్రెస్‌ పాలనలో పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసేవా రు. 6 గంటల కంటే ఎక్కువగా కరెంట్‌ వాడితే పరిశ్రమలు ముసివేస్తామని నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. నరేంద్ర మోదీ గారి వచ్చిన తర్వాత విద్యుత్‌ కోతలు లేని భారతం ఆవిష్కృతమైంది. అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది…పేదరికం తగ్గుతుందన్నారు.

పీవీ మార్గ్‌లోని సంజీవయ్య పార్క్‌లో హుస్సేన్‌సాగర్‌ అలలపై లేజర్‌ ఆధారిత సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను ప్రారంభించాం… పిల్లలకు తెలిసేలా కోహినూర్‌ వజ్రం భిన్న సంస్కృతులు, వివిధ ఖండాలను దాటి సాగించిన కథను ఈ షోలో వాటర్‌ స్క్రీన్‌పై చూపించాం. బేగంపేట రైల్వేస్టేషన్‌ కూడా అద్భుతంగా తీర్చిదిద్దుతు న్నాం.. బేగంపేట, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లతో పాటు చర్లపల్లి టెర్మినల్‌ను అభివృద్ది చేస్తున్నా ం… ఇటీవలే మెట్రో సెకండ్‌ ఫేజ్‌ను ప్రారంభించడం జరిగింది. పాఠశాలలో టాయిలెట్‌, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల వంటి మౌళిక వసతులను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

500 ఏళ్లుగా పెండిరగ్‌లో ఉన్న సమస్యలను సైతం పరిష్కరించినట్లు తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌, రహదారులు, వ్యవసాయ రంగం, స్టార్టప్‌ కింద యువతను ప్రోత్సహించడం వంటి అనేక అభివృద్ది కార్యక్రమాలు చేశారన్నారు. భారత్‌ బయోటెక్‌ వంటి కరోనా తయారీ చేసే సంస్థలను ప్రోత్సహించి ప్రాణాలు కాపాడారని అన్నారు. ఉక్రెయిన్‌ యుద్దం జరిగినప్పుడు రష్యాతో యుద్ధం ఆపించి 25,000 మంది భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చారు…ఇలా గత పదేళ్లలో అనేక సంస్కరణ లు తీసుకొచ్చామని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE