Suryaa.co.in

Political News

మొహువ మొయిత్రా.. అదానీ.. పార్లమెంట్ లో ప్రశ్నలు

మొహువ మొయిత్రా అడ్డంగా బుక్ అయ్యింది!
పార్లమెంట్ లో తరుచూ ప్రశ్నలు వేస్తూ ఉంటుంది!
కానీ డబ్బులు తీసుకుని మరీ ప్రశ్నలు వేస్తుంది!

జై అనంత్ దేహాద్రి
ఇతను సుప్రీం కోర్టు అడ్వొకేట్!
మొహువ మొయిత్రా కి క్లోజ్ ఫ్రెండ్!
***
దర్శన్ హీరానందాని
ఇతను బిజినెస్ టైకూన్ మరియు హీరానందాని గ్రూప్ కి చీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్
*****
సదరు సుప్రీంకోర్టు అడ్వకేటు అయిన జయ్ అనంత్ CBI కి ఒక ఆఫడవిట్ పంపించాడు! దానిలో TMC MP అయిన మొహువ మొయిత్రా హీరా నందాని దగ్గర డబ్బులు తీసుకొని పార్లమెంట్ లో ప్రశ్నలు ఆడిగింది. నా దగ్గర బలమయిన ఆధారాలు ఉన్నాయి అని.
ఒక సుప్రీం కోర్టు అద్వకేట్ ఆఫడవిట్ సీబీఐ కి ఇచ్చి ఒక పార్లమెంట్ సభ్యురాలి మీద తీవ్ర అభియోగాలు మోపి అవి నిరూపించే సాక్ష్యాలు ఇవ్వలేక పోతే సదరు అడ్వకేట్ బార్ అసోసియేషన్ నుండి తాత్కాలికంగానో లేదా శాశ్వతంగా నో బహిష్కరించబడతాడు.
కాబట్టి జయ్ అనంత్ దగ్గర నిరూపించతగ్గ ఆధారాలు ఉండే ఉంటాయి!
******
ఇంతకీ మొహువ మొయిత్ర , బిజినెస్ టైకూన్ దర్శన్ హీరా నందాని లు కలిసి ఎవరిని టార్గెట్ చేశారు?
అదాని గ్రూప్ చైర్మన్ ఆదానీ ని!
******
సీబీఐ కి సుప్రీంకోర్టు అడ్వకేట్ జయ్ అనంత్ ఇచ్చిన ఆఫడవిట్ లో ఏమున్నది? కొన్ని వివరాలు బయటకి వచ్చాయి…..

1.మొహువ మొయిత్ర ఒక పార్లమెంటు సభ్యురాలుగా ఉంటూ తనకున్న అధికారాన్ని ఫణంగా పెట్టి పార్లమెంట్ ప్రొసీడింగ్స్ని మరియు కొన్ని పాలసీ విషయాలని హీరా నందాని కి ఇచ్చి డబ్బు తీసుకుంది.నిజానికి ఇవన్నీ రహస్యంగా ఉంచాల్సిన అంశాలు.
2.మహువ కి లక్జరీ గా బ్రతకడంలో విపరీతమయిన పిచ్చి ఉంది.అలా బ్రతకడానికి ఏదయినా చేస్తుంది. అవన్నీ హీరా నందాని ఇస్తాడు.
3.ఖరీదయిన i phones.
4.ఖరీదయిన వజ్రాలు మరియు ఎమరాల్డ్ ఆభరణాలు.
5.Scarves from Hermes and Louis Vuitton
6. 35 pair shoes of Salvatore Ferragamo.
7.ఖరీదయిన ఫ్రెంచ్ ఇటాలియన్ వైన్ బాటిళ్లు 12.
8.లక్జరీ కాస్మెటిక్స్ దుబాయ్ నుండి తెప్పించినవి.
9.GUCCI లక్జరీ బాగ్స్.
10.Berluti crocodile leather bag.
11.ఖర్చుల కోసం ప్రతి రోజూ భారతీయ కరెన్సీ తో పాటు బ్రిటీష్ పౌండ్స్ ఇస్తాడు ఇవి కాష్ రూపములోనే ఇస్తాడు.
12.హీరా నందాని తన ముందే 20,000 బ్రిటీష్ పౌండ్స్ మొహువ కి ఇచ్చాడని తన ఆఫడవిట్ లో పేర్కొన్నాడు జయ్ అనంత్!
13.పార్లమెంట్ సభ్యులు అందరికి లోక్ సభ కి సంబంధించి అన్ని సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
14.వాటిలో ఆన్ లైన్ పోర్టల్ ఒకటి.ఈ ఆన్లైన్ పోర్టల్ లోకి యాక్సెస్ అవ్వాలి అంటే యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పోర్టల్ కేవలం పార్లమెంట్ సభ్యులకి మాత్రమే యాక్సెస్ ఉంటుంది.
15.ఈ ఆన్ లైన్ పోర్టల్ లో కూడ ప్రశ్నలు అడగవచ్చు మరియు సమాధానం కూడా అక్కడే వచ్చేస్తుంది.
16.మొహువ ఇప్పటి వరకు 61 ప్రశ్నలు అడిగితే వాటిలో 50 ప్రశ్నలు నేరుగా పార్లమెంట్ సమావేశాలలో నేరుగా అడిగింది.
17.11 ప్రశ్నలు ఆన్లైన్ పోర్టుల్ లో అడిగినవి ఉన్నాయి.
18.ఆన్లైన్లో అడిగిన11 ప్రశ్నలు మొహువ ఆడిగినవి కావు. తన యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ హీరా నందా ని కి ఇస్తే హీరా నందాని అడిగాడు!
19.మొత్తం 61 ప్రశ్నలు ఏవేవి మొహువ ఆడిగిందో అవి తన ఆఫడవిట్ లో వివరంగా పేర్కొన్నాడు. ఆన్లైన్ లో అడిగిన ప్రశ్నలు కూడా పేర్కొన్నాడు. అఫ్కోర్స్ ఆన్ లైన్ లో అడిగిన ప్రశ్నలు తాలూకు లాగ్ ఫైల్ లోక్సభ సెక్రటేరియట్ లో రికార్డు ఉంటుంది. మరి ఆన్లైన్ లో అడిగిన ప్పుడు ఆ విషయం జయ్ అనంత్ కి ఎలా తెలిసింది అనేదే దోషిని పట్టిచ్చే ఆధారం!
20.మొహువ అడిగిన 61 ప్రశ్నలు అన్నీ హీరా నందాని గ్రూపుకి ప్రయోజనం కలిగించేవే.
21.ఈ క్విడ్ ప్రో కో 2018 నుండి జరుగుతున్నది.
22. మార్చి నెల 2020 లో హీరా నందాని 75 లక్షలు ఇచ్చాడు మొహువ కి.
23.మే నెల 2021 లో హీరానందాని 2 కోట్లు ఇచ్చి గౌతమ్ ఆదానీ ని పార్లమెంట్ లో బయట టార్గెట్ చేయమని అడిగాడు.
24.మొహువ మొయిత్ర ఫ్లాట్ ని రెనోవేట్ చేయడానికి తన ఆర్కిటెక్ట్ ని పంపించాడు హీరా .నందాని.
25.ఆర్కిటెక్ట్ డిజైన్ చేయగానే తన ఇంట్లోని ఖరీదయిన ఫర్నిచర్ ని మొహువ ఫ్లాట్ లో పెట్టించాడు హీరా నందాని.
*****
వెస్ట్ బెంగాల్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ తాలూకు టెండర్ కి సంబంధించి గౌతమ్ ఆదానీ, హీరా నందాని పోటీ పడ్డారు కానీ అదాని అ టెండర్ లో సక్సెస్ అయ్యాడు.
ఆ టెండర్ ని రద్దు చేయించమని మొహువ మీద ఒత్తిడి తెచ్చాడు హీరానందాని కానీ మమత ని ఒప్పించడం కష్టం అని మొహువ తెలిపింది.
టెండర్ రద్దు చేయించలేదు కాబట్టి పార్లమెంట్ లో, బయట ప్రెస్ మీట్ లలో ఆదానీని టార్గెట్ చేయమని కోరాడు ఆ పని చేసింది మనo చూశాము.
******
ఇందులో ఒక ట్విస్ట్ ఉంది.
పార్లమెంట్ సభ్యులు డబ్బులు తీసుకొని ప్రశ్నలు ఆడగడం నేరం అవుతుందా కాదా?
పార్లమెంట్ ఆవరణలో కనుక డబ్బు తీస్కుంటే అది నేరం కాదుట!
పార్లమెంట్ బయట కనుక డబ్బు తీసుకుంటే అది నేరం అవుతుంది ట.
******
ఈ ఇష్యూ మీద ఈ నెలలోనే 7 గురు సభ్యుల కల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేసి తీర్పు ఇవ్వబోతున్నది.
ఒక వేళ కనుక డబ్బు తీసుకొని ప్రశ్నలు అడగడం నేరమే దానికి రాజ్యాంగంలో ఎలాంటి రక్షణ లేదు అని తీర్పు వస్తే మొహువ మొయిత్ర తో పాటు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల మెడకు ఉచ్చు బిగుస్తుంది!
ఏమవుతుందో ఇంకో వారం ఆగితే తెలుస్తుంది.
జైహింద్!

– పార్ధసారధి పోట్లూరి

LEAVE A RESPONSE