=తెలంగాణ తో మంగోలియా సాంస్కృతిక, బౌద్ధ, పర్యాటక క్రీడారంగాల్లో అవగాహన ఒప్పందానికి ఆసక్తి
– మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ వెల్లడి
విలక్షణ జానపద, గిరిజన సాంస్కృతి, బౌద్ధ వారసత్వం, పర్యాటక ఆకర్షణలు, విభిన్న క్రీడలకు ఘనమైన చరిత్రకు నిలయమైన తెలంగాణ రాష్ట్రం తో అదే తరహా గిరిజన సంస్కృతి, బౌద్ధ వారసత్వం, ప్రత్యేక క్రీడలు, గొప్ప చరిత్ర గల మంగోలియా దేశం ఆయా రంగాల్లో పరస్పర సహకారం పెంపొందేలా ఒక అవగాహన ఒప్పందం చేసుకునేందుకు ఆసక్తి ని, మంగోలియన్ దౌత్య ఉన్నతాధికారి చేసిన విజ్ఞప్తి ని పరిశీలిస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, పురావస్తు శాఖ మంత్రి డా.వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
నాగార్జున సాగర్ లో ప్రతిష్టాత్మక బుద్దవనం ప్రాజెక్టు ను పరిశీలించి వచ్చిన అనంతరం దౌత్య ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆధ్వర్యంలో 7 ఐలాండ్స్ బ్రాండ్ & బిజినెస్ కన్సల్టెన్సీ చొరవతో బుద్ధవనంలో మంగోలియా బౌద్ధ ఆరామం నిర్మించడానికి ఆసక్తి కనబరుస్తున్న మంగోలియా దేశ ఉన్నత దౌత్యధికారి గన్ బోల్డ్ దంబజావ్, మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఆయన్ను కలిసిన సందర్భంగా పై ప్రతిపాదన చేశారు. ఈ సందర్భంగా మంత్రి డా శ్రీనివాస్ గౌడ్ మంగోలియన్ దౌత్య అధికారులు చేసిన విజ్ఞప్తి ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు.
ఈ సందర్భంగా మంగోలియా ఉన్నత దౌత్యాధికారిని మంత్రి డా. శ్రీనివాస్ గౌడ్ ఘనంగా సత్కరించి, ఇరుపక్షాల మధ్య బౌద్ధ, సాంస్కృతిక క్రీడా రంగాల్లో సహకరించుకొని సంబంధాలు పెంపొందించుకునే దిశగా జరిగిన చర్చల్లో భాగంగా, బుద్ధవనంలో మంగోలియా ఆదేశ వాస్తు శైలి ఉట్టిపడేలా ఒక ఆకర్షణీయమైన బౌద్ధరామం నిర్మించడానికి మంగోలియా దౌత్యధికారి ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుద్ధ వనంలోని ఖాళీ స్థలంలో మంగోలియా బౌద్ధ ఆరామానికి స్థలాన్ని కేటాయించడానికి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయమని మంత్రి, పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ ఎండి బి.మనోహర్ ను ఆదేశించారు.
మంగోలియా గిరిజన సంస్కృతికి, తెలంగాణ గిరిజన సంస్కృతికి సారుప్యత ఉన్నందున ఈ దిశగా అవగాహన ఒప్పందం చేసుకోవడానికి గల అవకాశాలను పరిశీలించి, ప్రతిపాదనలు సిద్ధం చేయమని తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని కుస్తీ పోటీలు నిర్వహించిన తాళింఖానాలు, వ్యాయామ శాలలు, విలువిద్య, ఇతర రంగాల్లో, అలాగే మంగోలియా దేశంలో ప్రత్యేకత సంతరించుకున్న సుమో, మల్లయుద్ధం గుర్రపు స్వారీ రంగాల్లో ద్వైపాక్షిక అవగాహన ఒప్పందం చేసుకునే విషయంపై తగు ప్రతిపాదనలు సిద్ధం చేయమని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రాకృతిక సౌందర్యం కొండలు కోనలు నదులు సరస్సులతో పర్యావరణ , పర్యాటక ఆకర్షణ నెలవైన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అదే తరహా ప్రకృతి వనరులున్న మంగోలియా దేశంతో పర్యాటకరంగా రంగంతో పరస్పర సహకారంతో వేపాక్ష ఒప్పందం చేసుకునే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయమని పర్యాటక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
బుద్ధుని జీవిత కాలంలోనే బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి తేరే వాద యతిహాని వజ్రయాయం దశల్లో విలసిల్లిన బౌద్ధ కట్టడాలు శిల్పకలకు నిలయమైన తెలంగాణ ఆచార్య నాగార్జున ని స్థావరమైన నాగార్జునసాగర్ ప్రాంతం లో తెలంగాణ ప్రభుత్వం వద్ద విలక్షణ బౌద్ధ కట్టడాలకు బౌద్ధ సంస్కృతికి పేరుగాంచిన మంగోలియా దేశంలో బౌద్ధ పర్యాటక రంగంలో పరస్పర సహకారంతో అవగాహన ఒప్పందం దానికి గల అవకాశాలను పరిశీలించి తగు ప్రతిపాదనలు సిద్ధం చేయమని పర్యటక శాఖ బౌద్ధవనం అధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో మంగోలియా దేశ ఉన్నత దౌత్యాధికారి గన్ బోల్డ్ దంబాజియా, బౌద్ధమనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య, పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఎండి బి మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, ఓఎల్జి సుధాన్ రెడ్డి బుద్ధిష్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ ఏమని శివనాగిరెడ్డి, ఐలాండ్స్ బ్రాండింగ్ కన్సల్టెన్సీ డైరెక్టర్ సంజయ్ దాస్, ప్రతినిధి సాక్షి రోజా బుధవారం డిజైనింగ్ ఇంచార్జి డిఆర్ శ్యాంసుందర్రావు పాల్గొన్నారు.