Suryaa.co.in

Telangana

చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారు

– 1000 ఉరుల చెట్టును మరిచిపోతామా ?
– ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి మాట్లాడారు. తెలంగాణ విమోచన దినోత్సవంపై కేసీఆర్ గతంలో ఒకమాట.. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు.సెప్టెంబర్ 17న విమోచనమా.. విలీనమా అనేది అర్థం కాకుండా ఏ పేరు పడితే ఆ పేరు పెడుతున్నారు.మేము విమోచన దినోత్సవం జరుపుతాం.. మీరు ఏ పేరు మీద అయినా వేడుకలు జరుపుకోండి.

చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారు.రాబోయే తరాలకు చరిత్ర తెలియాలని బీజేపీ పాటు పడుతోంది. సెప్టెంబర్ 17 న కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు వస్తున్నారు. 2002 నుంచి మహారాష్ట్ర, కర్ణాటకలో విమోచన దినోత్సవం నిర్వహిస్తున్నారు.ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తలవంచి వేడుకలు నిర్వహిస్తోంది అంటే కారణం బీజేపీ నేతల కృషి వల్లే.

తెలంగాణ ప్రభుత్వం మోడీ, అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ పై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నా మేము ఊరుకున్నాం.బీజేపీ నేతలు పోస్టులు పెడితే మాత్రం అరెస్టులు చేశారు. 1000 ఉరుల చెట్టును మరిచిపోతామా? అమిత్ షా హాజరయ్యే కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.ఇన్ని రోజులు వ్యతిరేకించిన అసదుద్దీన్ కూడా నేడు త్రివర్ణ పతకాలు పట్టుకొని ర్యాలీలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.నిజాం కు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తులను కలవడంతో పాటు సన్మానిస్తాం. వారు బతికిలేకుంటే వారి కుటుంబ సభ్యులను కలుస్తాం. పార్టీకి సంబంధించిన వాల్ పోస్టర్లు కాకున్నా టీఆర్ఎస్ నేతలు వాటిని చింపుతున్నారు.

8.30 వరకు అమిత్ షా పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు.వందన స్వీకారం.జాతీయ పతాక ఆవిష్కరణ.తెలంగాణ కల్చర్ కు సంబంధించిన 1300 మంది కళాకారులతో ప్రదర్శన.బోనాలు, సన్నాయి, బతుకమ్మ, ఒగ్గు, గుస్సాడీ వంటి నృత్యాలు.అనంతరం పార్టీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 17 నుంచి అక్టోబర్ 2 వ తేదీ వరకు దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు.మోడీ పుట్టినరోజు నుంచి గాంధీ జయంతి వరకు సేవా కార్యక్రమాలు. మధ్యాహ్నం 2.30 కి క్లాసిక్ గార్డెన్స్ లో వికలాంగులకు వీల్ చైర్లు అందిస్తారు. తెలంగాణ నుంచి 8 ట్రూపులు, 2 కర్ణాటక, 2 మహారాష్ట్ర కు చెందిన ట్రూపులు పాల్గొంటాయి.

LEAVE A RESPONSE