-పార్టీ అనుబంధ విభాగాల సమీక్ష లో చంద్రబాబు దిశానిర్ధేశం
అమరావతి: పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ సమావేశంలో 20 అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఆయా విభాగాల బలోపేతం పై చర్చించారు. ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత ప్రభావవంతంగా పోరాటం చెయ్యాలని అనుబంధ సంఘాల నేతలకు చంద్రబాబు సూచించారు. అనుబంధ విభాగాల పనితీరును సమీక్షించిన చంద్రబాబు…రానున్న రోజుల్లో చేయ్యాల్సిన పోరాటం పై దిశా నిర్థేశం చేశారు. అనుబంధ విభాగాలు మరింత క్రియాశీలకంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెమ్ నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర, టిడిపి కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సమావేశానికి హాజరయ్యారు.