– బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
విజయవాడ: క్రిషిక్ భారతి క్రిబ్కో చైర్మన్, పారిశ్రామిక వేత్త వల్లభనేని సుధాకర్ చౌదరి తో బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి అవసరమైన ఎరువులు ఉత్పత్తి కి క్రిబ్కో ద్వారా సహకరించాలని కోరారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లు మూత పడుతున్నాయని అందువల్ల వాటిని పునరుద్ధరణ లేదా ఫ్యాక్టరీ లను బయోఇథనాల్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలించాలని మాధవ్ సూచించారు.
ఇదే విషయం పై సుధాకర్ చౌదరి స్పందిస్తూ ఉన్నత స్థాయి కమిటీ వేసి సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీ లలో బయో ఇథనాల్ ఉత్పత్తి అవకాశాలు పరిశీలించడానికి వీలుంటుందని ఆయన పేర్కొన్నారు.
క్రిబ్కో చైర్మన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాధవ్ అభినందనలు తెలిపి శాలువాతో సుధాకర్ చౌదరిని ఘనంగా సత్కరించారు.