– నేతలకు, కార్యకర్తలకు మంత్రి అమర్ నాథ్ దిశా నిర్దేశం
అనకాపల్లి, జూన్ 25: వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాధ్ పార్టీ నాయకులు, కార్య కర్తలకు దిశానిర్దేశం చేశారు. అనకాపల్లి నియోజకవర పార్టీ ప్లీనరి సన్నాహక సమావేశం స్థానిక వైసీపీ కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి అమరనాధ్ మాట్లాడుతూ 2024లో జరగనున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ ఇప్పటి నుంచే సిధ్ధంగా ఉండాలని సూచించారు.
అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఇందుకు తగినట్టుగా అధికారిక యంత్రాంగాని ఆయా ప్రాంతాల్లో నియమించుకోవాలని, అందుకు తన సహాయ, సహకారాలు అందిస్తానాని అమర్ నాధ్ వెల్లడించాలి. వచ్చే ఎన్నికల్లో జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత పార్టీ క్యాడర్పైనే ఉందని అన్నారు. జగన్ అధికార లోకి వచ్చిన మూడేళ్లలో 95శాతం హామీలను నెరవేర్చిన విషయాన్ని మంత్రి అమర్ గుర్తుచేశారు. సంక్షేమ కార్య క్రమాల అమలులో క్షణం ఆలస్యం జరగకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.
మీ అభిమానం నన్ను ఇంత వాణ్ణి చేసింది. సామాన్య నాయకునిగా ఉన్న నన్ను మంత్రిగా చేసి, ముఖ్యమంత్రి సరసన నన్ను నిలబెట్టినది.మీ అభిమానమేనని మంత్రి అమర్ నాథ్ సమావేశానికి వచ్చినాయకులు, అభిమానులనుద్దేశించి అన్నారు. అందరి మీద నేను ప్రేమాభిమానాలను నేరుగా వ్యక్త పరక పోవచ్చు. కాని మీ అందరిని పేరుపేరునా గుర్తుంచుకున్నాను. మీరు నా గుండెల్లోనే ఉంటారు’ అని అమర్ చెప్పారు. రానున్న ఎన్నికలలో విజయానికి మనమంతా కలిసికట్టుగా పనిచేయాల్సి ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 28న జరగనున్న ప్లీనరి సమావేశాన్ని విజయవంతం చేయలని అమర్ కోరారు.
పార్టీ పరిశీలకులు రాజారాం మాట్లాడతూ గుడివాడ అమర్ కుటుంబానికి మూడు తరాల రాజకీయ అనుభవం ఉందని అన్నారు. అమర్ నిమళ్ళీ గెలిపించుకోడానికి అందరూ కంకణ బద్ధులు కావాలని ఆయన కోరారు. కోవిడు కాలంలో కూడా మూఖ్యమంత్రి జగన్ కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిం చారని అన్నారు. ప్లీనరికి ముందు ఏర్పాటు చేసుకునే కమిటీలో మహిళలకు 50 శాతం స్థానం కల్పించాలని ఆయన సూచించారు.
మరో పరిశీలకులు, డీసిఎంఎస్ చైర్మన్ ముక్కా మహాలక్ష్మి నాయుడు మాట్లాడుతు మంత్రి అమరనాధ్ కు మంచి పేరు తీసుకువచ్చేలా పార్టీ కార్య కర్తలు, నాయకులు పని చేయులని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీపు కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పార్టీ విజయంకోసం సమష్టిగా పనిచేయాలని కోరారు. 2019 లో ప్రజలకు మనం ఏమిచేయకుండానే, ప్రజలు పార్టీకి 151 సీట్లు ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో 1,40,000 కోట్ల రూపాయల సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన మనకు వచ్చే ఎన్నికలలో 175 కి 175 సీట్లు మన పార్టీకి అందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఓటు అడిగే హక్కు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో పెద్దయెత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం. అనకాపల్లి లో ప్లీనరి జరిగే పెoటకోట కల్యాణ మండపాన్ని మంత్రి అమరనాధ్ పరిశీలించారు.