– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అసహనం తో మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలకు చేతలకు పొంతన కనబడటం లేదు.. సంక్షేమ మంత్రి లక్ష్మణ్ కుమార్ గురుకులాల పరిస్థితి గురించి గొప్పగా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలోనే గురుకులాల పరిస్థితి బాగా లేదని చెప్పడం హాస్యాస్పదం.. సీఎం నియోజకవర్గం లో ఉన్న గురుకుల పాఠశాలను సందర్శిద్దామా? పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడే తేలుద్దామన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
గురుకులాల్లో ప్రతి రోజూ ఏదో ఓ ఘటన జరిగి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. లక్ష్మణ్ కుమార్ నిన్న గాక మొన్న మంత్రి అయ్యారు… ఆయన అహగాహన లేమితో మాట్లాడుతున్నారు. కేసీఆర్ హయాంలో గురుకులాల సంఖ్య 1024 కు పెంచాం. దాదాపు ఆరు లక్షల మందికి గురుకుల విద్య లభిస్తోంది. వివిధ రాష్ట్రాల అధికారులు నేతలు కేసీఆర్ హయం లో గురుకులాల గొప్పతనాన్ని తెలుసుకునేందుకు తెలంగాణ కు వచ్చి వెళ్లారు. 22 నెలల కాంగ్రెస్ దుర్మార్గపు పాలన లో గురుకులాల్లో వంద మందికి పైగా మందికి పైగా విద్యార్థులు చనిపోయారు. విద్యార్థుల దీనావస్థల గురించి సీఎం కు మంత్రికి పట్టింపు ఉందా? తన ధర్మపురి నియోజక వర్గం లో గురుకుల భవనాన్ని పూర్తి చేయని అసమర్థ మంత్రి లక్ష్మణ్ కుమార్. ఏనాడైనా గురుకులాల పై సీఎం, మంత్రి సమీక్ష చేశారా? గురుకులాలకు పక్కా భవనాలు కేసీఆర్ హయాంలో నిర్మించలేదు అనేది అబద్దం.