-జగన్ రెడ్డి పాలన సక్రమంగా ఉంటే ఇలా తరలించాల్సిన అవసరమొచ్చేదా?
-చంద్రబాబు సభలకు వస్తున్న జన ప్రవాహం చూసి జగన్ రెడ్డికి ఓటమి భయం
– తెలుగునాడు అంగన్వాడీ- డ్వాక్రా సాధికార సంఘం అధ్యక్షురాలు ఆచంట సునీత
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలకు డ్వాక్రా మహిళలు, అంగన్వాడీలు, విద్యార్థులను బలవంతంగా తరలించడం నిత్యకృత్యమైపోయింది. డ్వాక్రా సంఘాలు ఉన్నదే తన బహిరంగ సభలకు రావాలన్నట్టుగా ముఖ్యమంత్రి వ్యవహరించడం సిగ్గుచేటు. భారీగా జన సమీకరణ చేయాలని టార్గెట్లు పెట్టి బెదిరించడం నియంత పాలనకు నిదర్శనం. చంద్రబాబు పర్యటనలకు స్వచ్ఛందంగా పోటెత్తుతున్న జనాన్ని చూసి జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు తెచ్చిన డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసినందుకు, ఆదాయ పరిమితి నిబంధనతో అంగన్వాడీ సిబ్బందికి సంక్షేమ పథకాలు దూరం చేసినందుకు మీ సభలకు రావాలా? ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? బహిరంగ సభలకు రాకపోతే పథకాలు నిలిపేస్తామని స్థానిక వైసీపీ నేతలు బెదిరించడం దుర్మార్గం కాదా?
జగన్మోహన్ రెడ్డి పాలన సరిగా ఉంటే ఆయన సభలకు జనాన్ని తరలించాల్సిన అవసరం ఎందుకొచ్చేది? ముఖ్యమంత్రి పరదాల చాటున దాక్కుని పర్యటన చేయాల్సిన దుస్థితి ఎందుకొచ్చేది? వైసీపీ నేతలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రయోజనం లేదు. సభలకు బలవంతకు జన సమీకరణ వల్ల ఓటమి నుంచి తప్పించుకోలేరు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా జగన్ రెడ్డిని ఇంటికి సాగనంపుదామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.