Suryaa.co.in

Andhra Pradesh

హైకోర్టులో ఎంపీ అవినాష్ కి నిరాశ

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ రెడ్డి.. తమ ముందస్తు బెయిల్ కండిషన్లను సడలించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పుడు వారిద్దరూ దేశం విడిచి వెళ్లరాదని కోర్టు షరతు విధించింది. విదేశీ పర్యటనలకు అనుమితి కావాలంటే సీబీఐ కోర్టులో పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు తెలిపింది.

LEAVE A RESPONSE