Suryaa.co.in

Andhra Pradesh Telangana

డి.ఆర్.డి.ఎల్ ను సంద‌ర్శించిన ఎంపి కేశినేని శివ‌నాథ్

హైద‌రాబాద్ : స్టాండింగ్ క‌మిటీ ఆన్ డిఫెన్స్ స్ట‌డీ టూర్ లో భాగంగా స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మ‌న్ రాధ మోహ‌న్ సింగ్ ఆధ్వ‌ర్యంలో క‌మిటీ స‌భ్యుల‌తో క‌లిసి విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) హైద‌రాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీ (డి.ఆర్.డి.ఎల్) ను బుధ‌వారం సంద‌ర్శించారు. అలాగే డి.ఆర్.డి.ఎల్ లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిష‌న్ ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో స్టాండింగ్ కమిటీ ఆన్ డిఫెన్స్ ఛైర్మ‌న్ రాధ మోహ‌న్ సింగ్ తో క‌లిసి పాల్గొన్నారు. స్ట‌డీ టూర్ కి విచ్చేసిన సంద‌ర్భంగా డి.ఆర్.డి.ఎల్ అధికారులు ఎంపి కేశినేని శివ‌నాథ్ ను శాలువాతో సత్క‌రించారు.

LEAVE A RESPONSE