Suryaa.co.in

Andhra Pradesh

ఎంపీ పురందేశ్వరి ఆస్ట్రేలియా పయనం

రాజమహేంద్రవరం: కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ స్టీరింగ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యురాలు, మహిళా పార్లమెంటేరియన్లు, స్టీరింగ్ కమిటీకి చైర్‌పర్సన్‌ , రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఆస్ట్రేలియా బయలుదేరి వెళ్లారు. అక్కడ జరిగే 67 వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్(సీపీసీ)లో 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతుండగా, భారత నుండి ఎంపీ పురందేశ్వరి పాల్గొంటున్నారు.

ప్రపంచంలో మహిళలు ఎదుర్కొనే వివిధ సమస్యలపై సీపీసీలో చర్చించడంతో పాటు మహిళల ప్రాతినిధ్యం పెంపు తదితర సమస్యలపై చర్చలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలుగా, పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న ఎంపీ పురందేశ్వరిని కామన్వెల్త్ మహిళా పార్లమెంటరీ స్టీరింగ్ కమిటీ చైర్ పర్సన్ గా నియమిస్తూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు ఇచ్చిన సంగతి విదితమే. ఈనెల 10వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరిగే సమావేశాల్లో పాల్గొని, 11వ తేదీన భారత్‌ చేరుకుంటారు.

LEAVE A RESPONSE