Suryaa.co.in

Andhra Pradesh

అమరావతి నిర్మాణం చేతకాకపోతే రాజీనామా చేసెయ్

-లక్షల కోట్ల అప్పులు చేశావు… పదివేల కోట్లు అప్పు చేసి అమరావతి నిర్మించవచ్చు కదా?
-రాష్ట్రంలో మద్యం డిస్టరీలు నడుపుతున్నది ఎవరు??
-ఉత్పత్తిదారుడు ఎవరు అన్నది కాదు?… నిర్వాహణ దారుడు ఎవరో చెప్పాలి
-నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

అమరావతి నిర్మాణం చేతకాకపోతే ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. అమరావతి నిర్మాణం చేతకాకపోతే, వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకోవాలని సూచించారు. ఐదేళ్లు వ్యాపారం చేసి ఓ 40 వేల కోట్లు సంపాదించావు… వ్యాపారం చేసుకో, డబ్బులను సంపాదించుకో… రాష్ట్ర పరిపాలనా బాధ్యతలను మరొకరు చూసుకుంటారని హితవు పలికారు.

రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల లో లక్షల కోట్ల రూపాయలు అప్పులను చేసిందనీ, కోర్టు ఆదేశాల మేరకు ఓ 10 వేల కోట్ల రూపాయలు అప్పులను చేసి, అమరావతి నిర్మాణాన్ని చేపడితే తప్పా? అని ప్రశ్నించారు. గతంలో అమరావతి నిర్మాణం గ్రాఫిక్స్ అంటూ మంత్రులు మాట్లాడారని, ఒక అమాత్యుడు అయితే ఏకంగా అమరావతి స్మశానం అంటూ వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. అటువంటి అమరావతిని అద్దెకు ఇచ్చి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూస్తుందని ఎద్దేవా చేశారు. ఎవరైనా గ్రాఫిక్స్ ను అద్దెకు తీసుకొని డబ్బులు ఇస్తారా ?అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

అమరావతి భూములను అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం చీకటి జీవోను తీసుకువచ్చిందని రఘురామ కృష్ణంరాజు విరుచుకుపడ్డారు. ఆ చీకటి జీవోలు ఏంట్రా నాయనా… అంటూ అసహనం వ్యక్తం చేశారు. 280 ఎకరాల భూమిని అమ్మి, రెండువేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుని, అప్పుడు చిన్నాచితకా కట్టడాలను నిర్మిస్తారట అని రఘు రామ అపహాస్యం చేశారు. తడిగుడ్డతో గొంతులు కోసే ఇటువంటి వ్యవహారాలు… అమరావతి విషయములు చేయవద్దని హెచ్చరించారు..
అమరావతి విషయంలో మరిన్ని తప్పులు చేయకుంటే మంచిదని పలికారు. అమరావతి రైతులు, మహిళల ఉసురు తగిలి ఈ శవాలను పురుగులు కూడా ముట్టుకో వన్నారు. మీ దండుపాల్యం బ్యాచ్ శవాల సూక్ష్మజీవులు కూడా జోలికి రావన్నారు. అమరావతి రైతులు న్యాయాన్ని నమ్ముకొని పోరాడుతున్నారని, న్యాయం జరగడం ఆలస్యం కావచ్చు కానీ… న్యాయం జరగడం మాత్రం ఖాయమన్నారు.

నా సన్నిహితులను వేదిస్తున్నావ్ తస్మాత్ జాగ్రత్త
వచ్చే నెల నాలుగో తేదీన తన నియోజకవర్గమైన నరసాపురం పరిధిలోని భీమవరం లో జరిగే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తప్పకుండా హాజరవుతానని రఘురామకృష్ణంరాజు ఘంటా పథంగాచెప్పారు. నువ్వు హాజరైన, హాజరు కాకపోయినా, తాను మాత్రం హాజరవుతానని అన్నారు.. తన చుట్టూ ఉన్న సన్నిహితులను వేధించడం ద్వారా తనని భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నావని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రానికి రావొద్దని తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ కు చెప్పావని, ఒకరిద్దరు సన్నిహితులను వేధించి చిత్రహింసలకు గురి చేస్తున్నావని, నో కాలర్ ఐడి ద్వారా ఫోన్ లిఫ్ట్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని… ఇటువంటి చిల్లర పనులు, పిచ్చి పనులు మానుకోవాలని జగన్మోహన్ రెడ్డికి సూచించారు.

డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరగవు?
రాష్ట్రంలో మద్యం దుకాణాలలో డిజిటల్ లావాదేవీలు ఎందుకు జరగవని రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. కన్నాలు వేయడానికి నగదు లావాదేవీలను జరుపుతున్నారని ఆయన అన్నారు. కల్లు గీత కార్మికులు సైతం డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న తరుణంలో, వందల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగే మద్యం దుకాణాలలో డిజిటల్ లావాదేవీలు జరగకపోవడానికి కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి ఎవరు చేస్తున్నారన్నది ముఖ్యం కాదని, దాన్ని ఎవరు నిర్వహిస్తున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. మీ పెదనాన్న కొడుకు ఉన్నాడా?, ఎన్నో జిల్లాలను పరిపాలిస్తున్న నేతల కొడుకులు ఉన్నారా? ముష్టి గాడి వియ్యంకుడు ఉన్నాడా? అంటూ శరపరంపరగా ప్రశ్నస్త్రాలను స్పందించారు.

ఎస్పీవై రెడ్డి ప్లాంట్ లో ఇతర వాటాదారుల ఆపరేషన్, కోపరేషన్ తో లిక్కర్ దందా నడుపుతున్నది ఎవరో చెప్పాలన్నారు. అరబిందో సంస్థ కూడా కొన్ని డిస్టరీ లను తీసుకుని నిర్వహిస్తున్న దని, విశాఖలో రెడీగా ఉన్న ఒక ప్రాజెక్టును, విశాఖ ను రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్న ఒక వెధవ నడుపుతున్నారని అన్నారు. ఆఫీసర్ ఛాయిస్ లైసెన్స్ ఉన్న వ్యక్తిని బెదిరించి, ఆంధ్రా గోల్డ్ పేరిట చీప్ లిక్కర్ ఉత్పత్తి చేస్తున్నారని పేర్కొన్నారు.. రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన మద్యం విక్రయిస్తున్నారని ముఖ్యమంత్రి అసెంబ్లీలో పేర్కొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, నాణ్యమైన మద్యం విక్రయిస్తే ఊరి పేరు లేని లిక్కర్ బ్రాండ్లను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు . సంపూర్ణ మద్య నిషేధం అని గతంలో పేర్కొన్న ప్రభుత్వం… ప్రస్తుతం మద్య నిషేధం లేదు… తొక్క లేదని చెప్పకనే చెబుతుందన్నారు.

మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయంతో, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఆగి పోవాలని తెలుగుదేశం పార్టీ , దుష్టచతుష్టయం కుట్రలు చేస్తున్నారని సాక్షి దిన పత్రిక కథనాలు ప్రచురించడం పట్ల రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. నువ్వు బలంగా ఉంటే కదా కుట్రలు చేయడానికి, పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వాడిపై కుట్రలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకోబోయే వాడిని ఎవరైనా హత్య చేస్తారా అంటూ నిలదీశారు. నీపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికీ లేదన్న ఆయన, 2023 లో అయితే.. 2023 లోనే ఎన్నికలకు రెడీ అంటూ సవాల్ చేశారు.

హవ్వ …గ్రాఫ్ పెరిగిందట
ఆత్మకూరు ఎన్నికలలో 80 వేల మెజార్టీతో గెలిచినందుకు జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మేకపాటి కుటుంబానికి ఉన్న మంచి పేరుతో ఈ ఎన్నికల్లో గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి గెలిచారన్నారు. అంతేకానీ పోటీ లేనిచోట గతంలో 40 వేల మెజారిటీ వస్తే, ఈసారి 80 వేల మెజారిటీ వచ్చినందుకు తమ గ్రాఫ్ పెరిగిందని గొప్పలు పోతే ఎవరు ఏమి చేయలేరన్నారు. కొన్ని విలువలకు కట్టుబడి తెలుగుదేశం పార్టీ పోటీ చేయకపోగా, జనసేన కూడా బిజెపి అభ్యర్థికి మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.

ఇక బీజేపీ అభ్యర్థిని పోటీలో ఉంచాలని ప్రభుత్వ పెద్దలు బ్రతిమాలి నట్లుగా ప్రజలు పేర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కీలక బాధ్యతల్లో చిన్నచిన్న స్థాయి అధికారులను నియమించడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే మద్యం వ్యవహారాల పర్యవేక్షకులు బాధ్యత రైల్వే సర్వీస్ అధికారిని నియమించడం వెనుక, రేపు ఏదైనా విచారణ జరిగితే, ఆయన తన మాతృ సంస్థ రైల్వే సర్వీసులోకి వెళ్లి పోతాడనే బావనే అయి ఉంటుందని అన్నారు.

ఆల్కహాల్ తయారీలో ఈ ఎన్ ఐ ఉండాలి
ఆల్కహాల్ తయారీలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈ ఎన్ ఐ) తప్పక వాడాలని నిబంధనలు చెబుతున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ నిబంధనలు పాటించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలనలో మద్యం ఉత్పత్తి లో ఆల్కహాల్ తక్కువగా ఉండడంతో, మత్తు కలిగించే పదార్థాలను వాడుతున్నట్లు అనుమానంగా ఉందన్నారు.

గతంలో 50 వేల శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహిస్తే, ప్రస్తుతం లక్ష యాభై వేల శాంపిల్స్ పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లుగా సాక్షి దినపత్రికలో కథనం ప్రచురించడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఎస్ జి ఎస్ అనేది వరల్డ్ క్లాస్ లేబరేటరీ అని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు కలిగి ఉన్న సంస్థ అని పేర్కొన్నారు. ఆ సంస్థ తప్పు పట్టిందని గుర్తు చేశారు. రాష్ట్ర అ విభజన అనంతరం కొన్ని డిస్టరీ లకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుమతించిన మాట నిజమే అయినప్పటికీ, ప్రముఖ మద్యం బ్రాండ్ సంస్థలకు మాత్రమే అనుమతి ఇచ్చిందన్నారు.

అయితే సాక్షి దినపత్రిక మాత్రం తన కథనంలో యనమల రామకృష్ణుడు గారి తోడల్లుడు మునిమనవడు.. అయ్యన్నపాత్రుడు ప్రమేయం ఉందంటూ, తల తోక లేకుండా రాసింది అన్నారు. రాష్ట్రంలో లో డిస్టరీ లను నిర్వహిస్తున్న ది ఎవరో ప్రభుత్వం స్పష్టం చేయాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE