ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. ‘‘అనారోగ్యం వల్ల విచారణకు హాజరుకాలేను.దిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యాను. విచారణకు హాజరయ్యేందుకు నాలుగు వారాల సమయం ఇవ్వాలి’’ అని సీఐడీ పోలీసులకు రాసిన లేఖలో రఘురామ కోరారు. కాగా ఈరోజు సీఐడీ విచారణకు రఘురామ హాజరు కావాల్సి ఉంది.ఏపీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ కొన్ని రోజుల ముందు సీఐడీ అధికారులు రఘురామకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.