హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం

Spread the love

హైదరాబాద్ మహా నగరంలోని గాంధీ ఆస్పత్రిలో కరోనా కలకలం రేపుతోంది. గాంధీ ఆస్పత్రిలో మొత్తం 120 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.ఇందులో 40 మంది పీజీ విద్యార్థులు, అలాగే 38 మంది హౌస్ సర్జన్లకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 35 మంది ఎంబిబిఎస్ విద్యార్థులు, ఆరుగురు ఎంపీలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారిక ప్రకటన వెలువడింది.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రి లోని మిగతా వైద్యులకు అలాగే నర్సు లకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు చేసిన కరోనా రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈ రిపోర్టులు బయటకు వస్తే కరోనా బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని గాంధీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. గాంధీ లో వైద్యులకు కరోనా సోకడం తో అక్కడి సిబ్బంది అలాగే రోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వైద్యులకే కరోనా పాజిటివ్ వస్తే తామేమి చేయాలంటూ… లబో దిబోమంటున్నారు.

Leave a Reply