Home » రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చెప్పుతో ఉరికించి కొట్టండి

రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే చెప్పుతో ఉరికించి కొట్టండి

-ఫోన్ ట్యాపింగ్ పైసలతో మీ ఓట్లను కొనాలనుకుంటున్నరు
-300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ కు అధికారం ఎట్లా సాధ్యం?
-హుజూరాబాద్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై నిప్పులు చెరిగిన
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పే వాళ్లను చెప్పు, చీపుర్లతో తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ పైసలతో కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్ధి ఓట్లను కొనాలనుకుంటున్నారని చెప్పారు. పొరపాటున ఆ పైసలు తీసుకుంటే… మీకు నోటీసులు వచ్చే ప్రమాదముందని ప్రజలను హెచ్చరించారు. 300 సీట్లకు మించి పోటీ చేయని కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారంలో ఎట్లా సాధ్యమని ప్రశ్నించిన బండి సంజయ్ ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లేనని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూరాబాద్ లో నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ కు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి తదితరులు హాజరైన ఈ సభలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై నిప్పులు చెరిగారు..

మే 13న పువ్వు గుర్తుపై ఓటేస్తే… కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల బాక్సులు బద్దలు కావాలే… కాంగ్రెస్ నన్ను ఓడగొట్టడానికి బి.సంజయ్ అనే వ్యక్తిని బరిలో దింపి కాలీ ఫ్లవర్ గుర్తు ఇప్పిస్తామని మాయ మాటలతో మభ్యపెట్టింది… కాంగ్రెస్ నేతలకు బుద్ది లేదు… నేరుగా ఎదుర్కొనే దమ్ములేక ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తున్నారు. అందుకే వాళ్లను కాంగ్రెసోళ్లు అంటున్నం.

బీఆర్ఎస్ అభ్యర్ధి నాన్ లోకల్. ఎన్నడైనా మీ వద్దకొచ్చారా? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ నుండి వరంగల్ రోడ్డును ఎందుకు విస్తరించలే? నేనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వద్దకు పోయి రోడ్డు మరమ్మతుల కోసం నిధులు తేవడమే కాకుండా రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.2 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చి ప్రధానితో పనులు ప్రారంభింపజేసిన. ఎల్కతుర్తి నుండి సిద్దిపేట రోడ్డు విస్తరణ పనులకు నేనే నిధులు తెచ్చిన.

కాంగ్రెస్ అభ్యర్ధిని ఆ పార్టీ కార్యకర్తలే ఎవరైనా గుర్తు పడతారా? అసలు ఆయన లోకలా? నాన్ లోకలా? కూడా ఎవరికీ తెల్వదు. ఫోన్ ట్యాపింగ్ డబ్బులతో టిక్కెట్ తెచ్చుకుని ఆ పైసలతోనే పంచి గెలవాలని చూస్తున్నరు. పొరపాటున ఆ పైసలు తీసుకుంటే మీరు ఇబ్బందుల్లో పడతారు. ఎందుకంటే ఆ ఫోన్ ట్యాపింగ్ చేసినోడు అమెరికాకు పారిపోయిండు. రేపు విచారణ జరిపితే… మీకు కూడా నోటీసులు వస్తాయి… మీరు కూడా జైలుకు పోక తప్పదు.. జాగ్రత్త.

బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నేను రూ.12 వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చిన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఏ విధంగా పోరాడనో మీకు తెలుసు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగ, ఉపాధ్యాయ,కార్మికుల పక్షాన ఎట్లా కొట్లాడానో మీకు తెలుసు. 150 రోజులు పాదయాత్ర చేసిన. బండి సంజయ్ కు ఓటేస్తే మీ ఓటుకు విలువ తెచ్చిన. బయటవాళ్లంతా కరీంనగర్ ప్రజలు కన్పిస్తే శభాష్ అనేలా పోరాటాలు చేసిన.

రేవంత్ రెడ్డి మాట్లాడితే బీజేపీ తెలంగాణకు ఏమిచ్చిందని అడుగుతున్నడు. బండి సంజయ్ ఏం చేసిండని అంటున్నడు.. ఆయనకు తెల్వదేమో. రాష్ట్రానికి కేంద్రం 10 లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చింది. నేనడుగుతున్నా… జమ్మికుంటకు వచ్చి ప్రధానిని తిట్టినవ్. నన్ను కూడా గుండు అని తిట్టినవ్. గాడిద గుడ్డు అన్నవ్. నామీద, గాడిద గుడ్డు మీద ఉన్న శ్రద్ద 6 గ్యారంటీల అమలుపై ఎందుకు మాట్లాడలేదు? వాటిని ఎందుకు అమలు చేయలేదు? ఇవి మాట్లాడకుండా తిట్టడమే పనిగా పెట్టుకుంటే జనం నమ్ముతారా?

రేవంత్ రెడ్డి… గత ఐదేళ్లలో మీ కాంగ్రెస్ నేతలు చేసిన పోరాటాలేమైనా ఉన్నాయా? నేను అన్ని వర్గాల పక్షాన కొట్లాడిన. వందల కేసులు పెట్టినా భయపడలే. జైలుకు పంపినా బెదరలే. మీ కోసం కొట్లాడితే కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశారు? వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని మోసం చేసిన కాంగ్రెస్ ను ఏం చేస్తారు? మహిళలకు నెలనెలా రూ.2500లు, తులం బంగారం, స్కూటీ ఇస్తానన్నడు. రైతులకు రూ.15 వేలు భరోసా, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తానన్నడు.

వడ్లకు రూ.500 బోనస్ ఇస్తానన్నడు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కనీస ధరకు కొంటానన్నడు… మరి ఎందుకు వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. బోనస్ పేరుతో ఎకరాకు రూ.14 వేలు ఇస్తానని మోసం చేసిండు. రూ.2 లక్షల రుణమాపీ చేస్తానని దేవుడి మీద ఓట్టేసి మాయ మాటలు చెబుతున్నడు.. నేను మాట్లాడితే దేవుడితో రాజకీయమంటారు? మరి రేవంత్ చేస్తుందేమిటి?

మేనిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని ఓట్లేయించుకుని మోసం చేసిన రేవంత్ రెడ్డి ఒక్క హామీ అమలు చేయకుండా జనాన్ని మోసం చేసిండు.. ఇప్పుడు మళ్లీ రుణమాఫీ పేరుతో ప్రజలను మోసం చేయబోతున్నడు.. కాంగ్రెస్ చేస్తున్న మోసాలకు బుద్ది చెప్పండి. రైతులకు ఎరువుల పేరుతో ఎకరాకు రూ.20 వేల చొప్పున సబ్సిడీ ఇస్తుందెవరు? మళ్లీ మోదీ ప్రధాని కాకపోతే రైతులపై పెద్ద ఎత్తున భారం పడుతుంది. సబ్సిడీలన్నీ ఎత్తివేస్తారు. మోదీతో దేశ రక్షణ. ఆపదలో ఆదుకునే వ్యక్తి మోదీ. పేదలను ఆదుకోవాలంటే మళ్లీ ప్రధాని కావాల్సిన అవసరం ఉంది.

రేవంత్ రెడ్డికి సీఎం సీటు పోతుందని భయం పట్టుకుంది. ఎంపీ సీట్లు రాకపోతే ఎట్లా అని ఆలోచిస్తున్నడు… ఆ బాధతోనే మోదీని తిడుతున్నడు. మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని అబద్దాలు చెబుతున్నడు… ఎవడైనా రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే… చెప్పు, చీపుర్లతో తరిమితరిమి కొట్టండి…..

సిగ్గుండాలే… ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. సిగ్గు లేకుండా మేం మత రిజర్వేషన్లు ఇవ్వలేదని, కుల రిజర్వేషన్లు మాత్రమే ఇచ్చారని బొంకుతోంది. మేం మళ్లా చెబుతున్నం… రిజర్వేషన్లను కొనసాగించి తీరుతాం… మోదీగారు బతికున్నంత వరకు రిజర్వేషన్లను కొనసాగిస్తామని ప్రకటించారు. మళ్లీ ఎవడైనా రిజర్వేషన్లు రద్దు చేస్తామని అంటే చెప్పు, చీపుర్లతో ఉరికించి ఉరికించి కొడతాం…

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తది? ఆ పార్టీ పోటీ చేసేదే 300 సీట్లు దాటడం లేదు? అధికారం కావాలంటే 275 సీట్లు కావాలే… మరి అధికారం ఎట్లా సాధ్యం? అసలు కాంగ్రెస్ కు ఎవరిని చూసి ఓటేయాలి? ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి ఎవరు? ప్రజల గురించి ఆలోచించే నాయకుడెవరు? అసలు మీకు అభ్యర్ధులే కరువైనరు. ప్రధాని అభ్యర్ధే లేరు. మరి ఆ పార్టీకి ఓటేస్తే మూసీలో వేసినట్లే…

కేసీఆర్ పార్టీకి ఏం చూసి ఓటేయాలి? రెండు పార్టీలు కలిసి దేవుడి ని హేళన చేస్తూ లబ్ది పొందాలనుకుంటున్నాయి. నేను బరాబర్ చెబుతున్నా.. రామ మందిరం అయోధ్యలోనే ఉండాలని మేం చెబుతున్నం… మీరు ఆ మాట చెప్పగలరా? ప్రాణ ప్రతిష్టకు పిలిస్తేనే వెళ్లని మీరు రామ భక్తులు ఎట్లా అవుతారు? మేం బరాబర్ హిందూ ధర్మం గురించి మాట్లాడతాం. రాముడి గురించి మాట్లాడతాం.

ఎందుకంటే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం కరసేవ చేసి బలిదానం చేసిన చరిత్ర బీజేపీది. మరి ఆ రెండు పార్టీల్లో ఎవరైనా బలిదానం చేశారా? ఈ దేశాన్ని కాపాడటానికి మేమే బలిదానం కావాలి? 370 ఆర్టికల్ రద్దు కోసం మేమే త్యాగం చేయాలి? పేదల పక్షాన మేమే పోరాటం చేయాలే… మరి మీకెందుకు ఓటేయాలి?

కేసీఆర్ మొన్న ఏం మాట్లాడిండు.. బియ్యంలో పసుపు పోస్తే అక్షింతలైతయా? పులిహోర ప్రసాదం తింటే కడుపు నిండుతదా? అంటున్నడు… కేసీఆర్ కు ఫుల్ బాటిల్ మందు కొడితే తప్ప కడుపు నిండదు.. అందుకే దేవుడి తీర్ధ ప్రసాదాలను హేళన చేస్తున్నడు… ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని కోరుతున్నా..

మీకోసం కొట్లాడుతున్నం మేం. నాపై 109 కేసులున్నయ్. ఇప్పటి వరకు 12 సార్లు జైలుకు పోయిన. ఇవన్నీ నా కోసం, కుటుంబం కోసం కాదు.. మీ కోసం కొట్లాడి జైలుకు పోయిన. మా కార్యకర్తలు జీవితాలు త్యాగం చేశారు. కుటుంబాలకు దూరమై మీ కష్టాల్లో పాలు పంచుకున్నరు

Leave a Reply