కాంగ్రెస్ లోకి దుబ్బాక బిజెపి, టీఆర్ఎస్ నాయకులు

Spread the love

– ఆహ్వానించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దుబ్బాక నియోజకవర్గం చెందిన బిజెపి, టిఆర్ఎస్ నాయకులు మంగళవారం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. దుబ్బాక మండలం చికోడ్ గ్రామానికి చెందిన బిజెపి జిల్లా నాయకులు బొంరం బాల్ రెడ్డి, దుబ్బాక పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు బాల నర్సులు ఆ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply