Suryaa.co.in

Telangana

సాగర్ మున్సిపల్ కమిషనర్, ఏఈలకు కలెక్టర్ షోకాజ్ నోటీసు

 – ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం

నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తాగునీటి ట్యాంకులో కోతులు పడి చనిపోయిన సంఘటనపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ విషయంపై నందికొండ మున్సిపల్ కమిషనర్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లకు ఆమె షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతేకాక స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టీ. పూర్ణచందర్ ను విచారణ అధికారిగా నియమించారు.సంఘటనపై తక్షణమే పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని ఆమె ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గురువారమే నందికొండ హిల్ కాలనీని సందర్శించి విచారణ చేపట్టి తన నివేదికను సమర్పించారు.

LEAVE A RESPONSE