-భూములు లాక్కొని చంపేందుకేనా నా బీసీలు అంటున్నావు
-టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ ధ్వజం
అంతులేని భూదాహం, ధన వ్యామోహంతో ఇంకెందరు బీసీలను బలి తీసుకుంటావని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఒక ప్రకటనలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ప్రశ్నించారు. మేనమామ కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ముఠా బీసీ సామాజికవర్గాని కి చెందిన శ్రీనివాసులు భూమిని కబ్జా చేసి అత్యంత దారుణంగా హతమార్చింది.కాపాడాల్సిన ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి హంతకులకు మద్దతుగా నిలిచాడు. బీసీల భూములు లాక్కొని చంపేందుకేనా నా బీసీలు నా బీసీలు అంటున్నావ్ జగన్‌రెడ్డీ అని విమర్శించారు.