ఆ కొకైన్ విలువ 80కోట్లు

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా కొకైన్‌ పట్టుబడింది. ఇద్దరు విదేశీయుల నుంచి దాదాపు రూ.80కోట్ల విలువైన కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్టు డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. టాంజానియా, కేప్‌టౌన్‌ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులను తనిఖీ చేయగా ఒక్కొక్కరి వద్ద 4కేజీల చొప్పన కొకైన్‌ బయటపడిందని తెలిపారు. కొకైన్‌ తరలిస్తున్న మహిళ, మరో వ్యక్తిని అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు. ట్రాలీ బ్యాగ్‌ అడుగు భాగంలో కొకైన్‌ పెట్టి తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. డ్రగ్స్‌ తరలిస్తున్నట్టు పక్కా సమాచారం అందడంతోనే నిఘా పెట్టి తనిఖీ చేశామని డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు.