Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ కార్యకర్తల్లా డీఎస్పీలు

-ఇద్దరు డీఎస్పీలను ఎన్నికల విధుల నుంచి తొలగించాలి
-ఎన్నికల అధికారులు నియమావళిని అనుసరించడం లేదు

-రెండు ఐడీ ప్రూఫ్‌లు తీసుకురావాలంటున్నారు
-పనిచేసే చోటే పోస్టల్‌ బ్యాలెట్‌పై ఆర్వోల తీరు సరిగా లేదు
-వ్యవస్థలను మేనేజ్‌ చేయాలని జగన్‌ రెడ్డి చూస్తున్నారు
-టీడీపీ సీనియర్‌ నేత వర్ల రామయ్య

అమరావతి, మహానాడు:అధికార వైసీపీకి కార్యకర్తల్లా పనిచేస్తున్న నెల్లూరు రూరల్‌, రాజమండ్రి సిటీ డీఎస్పీలపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌ మీనా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వీటితో పాటు ఓటరు స్లిప్‌ పంపిణీ వ్యవహారంపై రిటర్నింగ్‌ అధికారులకు సరైన గైడ్‌ లైన్స్‌ ఇవ్వాలని వర్ల రామయ్య ఈసీని కోరారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ సరైన రీతిలో జరిగేలా ఎన్నికల కమిషన్‌ స్ట్రీమ్‌ లైన్‌ చేయాలని అభ్యర్ధించారు. మహారాష్ట్రలో ఎన్నికల ఎన్నికల విధుల్లో ఉన్న మన రాష్ట్ర ప్రత్యేక దళాలకు చెందిన 900 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని వర్ల కోరారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

వైసీపీ కార్యకర్తల్లా డీఎస్పీలు…
నెల్లూరు రూరల్‌ డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి వైసీపీ కార్యకర్తలా పని చేస్తున్నారు. సీఎంవోలో ఓఎస్డీగా పని చేస్తున్న నీలకంఠరెడ్డికి బంధువు అవడంతో నెల్లూరు రూరల్‌ విధులను మరిచి పై అధికారులను కూడా లెక్క చేయకుండా ఇష్టనుసారంగా వ్యవహరిస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు అంటే అతని ఏహ్యభావం. వైసీపీ అభ్యర్ధులకు లబ్ధి చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను అడుగడుగునా అడ్డుకుంటున్నారు. వైసీపీ జెండాలు పట్టుకుని ప్రచారాలు చేసుకుంటున్నా ప్రశ్నించకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొనే ఎవరైనా కనపడితే ఆ జెండా ఎక్కడ కొన్నారు, బిల్లు చూపించడని కార్యకర్తలను వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ ఎలా గెలుస్తాడో నేను చూస్తానంటూ బహిరంగంగా చాలెంజ్‌ చేస్తున్నారు. ఇతని అరాచకాలపై గతంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. ఇంకా చర్యలు తీసుకులేదు. మరోసారి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం.

నెల్లూరు రూరల్‌లో వీరాంజనేయరెడ్డి డీఎస్పీగా ఉంటే ఎన్నికలు ప్రశాంతంగా జరగవు. ఎన్నికల విధుల్లో అతను ఉండకుండా దూరం పెట్టేలా ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల్లో వైసీపీకి లబ్ధి చేకూర్చుతాడని రాజమండ్రి సిటీ డీఎస్పీగా విజయ్‌పాల్‌ను వైసీపీ ప్రభుత్వం తీసుకువెళ్లింది. అందుకు కృతజ్ఞతగా వైసీపీ మాత్రమే విజయ్‌పాల్‌ పని చేస్తూ అడుగడుగునా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారు. అక్రమ కేసులు పెట్టి బైండోవర్‌లంటూ టీడీపీ యాక్టివ్‌ నాయకులను ఇబ్బందులు పెడుతున్నారు. టీడీపీ తరపున ఏజెంట్లుగా కూర్చోకుండా క్రిమినల్‌ కేసులు బనాయిస్తానని టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారు. ఇంత దారుణంగా వైసీపీ కార్యకర్తలా చెలాయిస్తున్న డీఎస్పీ విజయ్‌ పాల్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఓటరు స్లిప్‌ పంపిణీ వ్యవహారంపై ఆర్వోలకు సరైన డైరెక్షన్‌ ఇవ్వాలి
ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ తేదీకి ముందు ఓటర్లకు ఓటర్‌ స్లిప్‌లను ఇంటింటికి వెళ్లి ఇస్తారు. ఏ ఓటరు కనుక ఇంట్లో అందుబాటులో లేకపోతే అతని ఇంట్లోని కుటుంబసభ్యులకు ఓటరు స్లిప్‌ను ఇచ్చి వెళతారు. ఓటరు అందుబాటులో లేకపోతే ఇంట్లోని వేరొక ఓటరుకు ఇవ్వకుండా వెనక్కి వెళ్లిపోతున్నారు. స్లిప్‌ లేని ఓటరు పోలింగ్‌కు వచ్చేటప్పుడు తప్పకుండా రెండు ఐడీ ప్రూఫ్‌లను తీసుకురావాలని చెబుతున్నారు. ఇటువంటి నిబంధన ఎన్నికల నియమావళిలో అసలు లేదు. ఇలా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కొంతమంది ఆర్వోలు ప్రవర్తిస్తున్నారు. దీనిపై ఆర్వోలకు ఒక డైరెక్షన్‌ ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.

పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై ఎన్నికల కమిషన్‌ స్ట్రీమ్‌ లైన్‌ చేయాలి
పోస్టల్‌ బ్యాలెట్‌ వ్యవహారంలో ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు. పనిచేసే చోటనే ఓటు హక్కు వినియో గించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించింది. కానీ కొంతమంది ఆర్వోలు దీనిని పట్టించుకోవడం లేదు. సొంత నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజకవర్గాల్లో పని చేస్తున్న ప్రభుత్వం ఉద్యోగులకు పని చేసే చోటే పోస్టల్‌ బ్యాలెట్‌ అవకాశం కల్పించకుండా వారి సొంత నియోజక వర్గాలకు వెళ్లి ఓటు వేసుకోవాలని కొంతమంది ఆర్వోలు చెబుతున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియ సరైన రీతిలో జరిగేలా ఎన్నికల కిమషన్‌ స్ట్రీమ్‌ లైన్‌ చేయాలి. అవసరమైతే ఒకటి, రెండు రోజులు నమోదు కార్యక్రమాన్ని పొడిగించాలని ఈసీకి విజ్ఞప్తి చేసినట్లు వివరించారు.

మహారాష్ట్రలో ఉన్న 900 మందికి ఓటు హక్కు కల్పించాలి
ఓటు అనేది ప్రతీ భారతీయ పౌరుడి హక్కు. మన రాష్ట్రానికి చెందిన ప్రత్యేక సాయుధ దళాలు (సుమారు 900 మంది) మహారాష్ట్రలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వాళ్లు ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పించాలని ఇదివరకే మేము కోరాం. కానీ ఇప్పటివరకు దీనిపై ఏమి చర్యలు తీసుకున్నారో చెప్పలేదు. వారు ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్చించాలని కోరినట్లు చెప్పారు.

అవినీతిపరులను అంతమొందించాలి
అవినీతి సొమ్మును ఖర్చు పెట్టి వ్యవస్థలను మ్యానేజ్‌ చేయాలనుకోవడం సరైనది కాదు. ల్యాండ్‌, శాండ్‌, మైన్‌, వైను ద్వారా దోచుకున్న డబ్బును అధికారం నిలబెట్టుకోవడం కోసం ఖర్చు చేస్తున్నారు. ఇటువంటి అవినీతిపరుల పట్ల జాగ్రత్త వహించి మీ యొక్క పవిత్ర ఓటును రాష్ట్రాభివృద్ధికి పనిచేసే ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

LEAVE A RESPONSE