Suryaa.co.in

Andhra Pradesh

జగన్ హయాంలో విశాఖ.. విషాదపట్టణం

-జగన్ ఓటమికి దేవుడు స్క్రిప్ట్ రెడీ
-బీసీలు, ఎస్సీలంటే ఆయనకు చులకన
-సూపర్ -6 అంటే ఆంధ్రా భోజనం, రాయలసీమ రాగి సంకటి
-అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎగతాళి చేస్తున్నారు
-అరగంట అంబటికి కోపం వచ్చింది
-100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్.
– పెందుర్తి నియోజకవర్గం వేపగుంట శంఖారావం సభలో యువనేత నారా లోకేష్

పెందుర్తి : సిటీ ఆఫ్ డెస్టినీగా విశాఖను తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ. ఆనాడు ఏపీకి ఆర్థిక రాజధానిగా ఉన్న ప్రాంతం విశాఖపట్నం. బాబు హయాంలో విశాఖ పట్నం జాబ్ కేపిటల్ ఆఫ్ ఇండియా అయితే జగన్ గంజాయి కేపిటల్ గా విశాఖను మార్చారు. బాబు గారి హయాంలో మోస్ట్ హ్యాపెనింగ్ సిటీగా విశాఖ ఉంటే, జగన్ హయాంలో విశాఖ విషాద పట్టణంగా మారింది.

బాబు గారి హయాంలో రోజుకో కంపెనీ, ఐటీ పరిశ్రమలు, అదానీ డేటా సెంటర్, కాండియంట్, మెడికల్ డివైసెస్ మానుఫ్యాక్చరింగ్ చేసే ఏఎం టీజర్ తీసుకువస్తే.. జగన్ రెడ్డి హయాంలో భూకబ్జాలు, కిడ్నాప్ లు, దోపిడీలు, చెరువుల ఆక్రమణలు జరుగుతున్నాయి.

నిజమే…అది సింహాసనమే. అయితే నేను చెప్పింది దాని మీద కూర్చున్న శునకం గురించి, ఆ శునకాన్ని తరిమితరిమి కొట్టే రోజులు దగ్గర్లనే ఉన్నాయని నేను చెప్పింది కరెక్టేగా అరగంట అంబటి. ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పి మోసం చేశారు. 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ప్రతినెల పెన్షన్ ఇస్తానని చెప్పి మోసం చేశారు.

అందుకే మీ కష్టాలు చూసి బాబు సూపర్-6 ప్రకటించారు. సూపర్-6 కిచిడీ అని జగన్ అంటున్నారు. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు చూసి తీసుకువచ్చాం సూపర్ -6. సైకో పాలన తరిమికొట్టేందుకు తీసుకువచ్చాం. సూపర్ -6 అంటే ఆంధ్రా భోజనం, రాయలసీమ రాగి సంకటి. అలాంటి పవిత్ర కార్యక్రమాన్ని ఎగతాళి చేస్తున్నారు.

జగన్ ఓటమికి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశారు. వైకాపా తరపున పోటీ చేయడానికి కూడా అభ్యర్థులు దొరకడం లేదు. విశాఖ ఎంపీగా పక్క జిల్లా నుంచి ఓ మహిళను తీసుకువచ్చారు. ఒంగోలు ఎంపీగా చెవిలో పూలు పెట్టే చెవిరిడ్డిని తీసుకువచ్చారు. నెల్లూరు ప్రజలు చీపో అన్న అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట తీసుకువచ్చారు. గుంటూరుకు తీసుకువచ్చిన క్రికెటర్ అంబటి రాయుడు పారిపోయారు. కర్నూలు ఎంపీగా సొంత మంత్రిని నిలబడమంటే నాకొద్దని బైబై జగన్ అని వెళ్లిపోయారు. తిరుపతి ఎంపీగా సొంత ఎమ్మెల్యే ఆదిమూలంను నిలబడాలంటే బైబై అని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో 75 స్థానాల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి.

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కాదు కదా.. సామాజిక అన్యాయం జరుగుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలే ఈ విషయం చెబుతున్నారు. 62 మంది ఎమ్మెల్యేలను, 16 మంది ఎంపీలను ట్రాన్స్ ఫర్ చేస్తే అందులో ఎక్కువ మంది బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే.జగన్ సామాజికవర్గానికి చెందిన ఎవరినీ ట్రాన్స్ ఫర్ చేయలేదు, బర్తరఫ్ చేయలేదు. బీసీలు, ఎస్సీలంటే ఆయనకు చులకన.

ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఏనాడూ బీసీలు, ఎస్సీలను, ఎస్టీలను చిన్నచూపు చూడలేదు. బీసీలకు చెందిన 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 10 శాతం రిజర్వేషన్ తగ్గించి 16,500 పదవులు వారికి దూరం చేశారు. బీసీలపై ఏకంగా 27వేల కేసులు పెట్టారు.

అమర్ నాథ్ గౌడ్ అనే బాలుడు.. తన అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు వైకాపా నాయకులు బతికుండగానే పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఎంత అన్యాయం ఆ కేసులో ముద్దాయి విడుదలైతే వైకాపా నాయకులు జైలుకు వెళ్లి బయటకు వస్తుంటే ఊరేగిస్తున్నారు. బాధిత కుటుంబాల పిల్లలను మా తల్లి భువనేశ్వరి చదివిస్తున్నారు.

నేను టీసీఎల్, హెచ్ సీఎల్, ఫాక్స్ కాన్, జోహో లాంటి పరిశ్రమలు తీసుకువస్తే .. నువ్వు బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రా గోల్డ్ తీసుకువచ్చావు. నేను స్టాన్ పోర్డ్ లో ఎంబీయే చేస్తే నిన్ను టెన్త్ క్లాస్ పేపర్ల లీక్ కేసులో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో చితకబాదారు.

ఎన్టీఆర్ రూ.2కే కేజీ బియ్యం, రూ.50కే హార్స్ పవర్ మోటార్ ఇచ్చారు. ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. చంద్రబాబు దీపం పథకం, పసుపు కుంకుమ, పండుగకానుక, చంద్రన్న బీమా, పెళ్లికానుక, విదేశీ విద్య, రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ లాంటి 100 పథకాలు తీసుకువచ్చారు. 100 సంక్షేమ పథకాలు రద్దు చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్.

దసపల్లా, హయగ్రీవ, లులూ భూములు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, ఫ్రీడమ్ ఫైటర్స్ భూములు కొట్టేస్తున్నారు. టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్దఎత్తున కుంభకోణానికి పాల్పడుతున్నారు. రుషికొండకు గుండు కొట్టి రూ.500 కోట్లతో ప్యాలెస్ లు కట్టుకున్నారు.

విశాఖలో ఏ-2 విజయసాయిరెడ్డి అంతా నాశనం చేశారు. వైవీ సుబ్బారెడ్డి, ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. విశాఖ మన్యంలో లాటరైట్ బాక్సైట్ పెద్దఎత్తున దోచేస్తున్నారు. జీవీఎంసీ నుంచి ప్రతి రూపాయి ఈ ప్రభుత్వం దోచేస్తోంది. విపరీతంగా పన్నులు పెంచారు. ఒక్క రోడ్డు కూడా వేయలేదు. ఆంధ్రా యూనివర్సిటీలో 1500 పీహెచ్ డీ పోస్టులు కూడా అమ్ముకున్నారు. రూ.200 కోట్ల యూజీసీ గ్రాంట్లు కూడా కొట్టేశారు.

ఆనాడు హుద్ హుద్ తుఫాన్ వచ్చినప్పుడు సొంత కుటుంబ సభ్యులను కాదని, విశాఖ ప్రజలే నా కుటుంబ సభ్యులని.. చంద్రబాబు ఇక్కడకు చేరారు. ఆనాడు మా ఇంట్లో సీమంతం జరుగుతున్నా పది నిమిషాలు ఉండి ఇక్కడకు వచ్చారు. ఏడు రోజులు ఉండి అన్నీ చూసుకున్నారు. పాలు కావాలంటే అందించారు, నీళ్లు కావాలంటే అందించారు. యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. కరెంట్ కూడా వెంటనే ఇచ్చారు. ఆనాడు మోడీ కూడా వచ్చారు.

ఎక్కైడైనా తుఫాన్లు వచ్చినప్పుడు ప్రజలు బాధపడతారని.. అదే విశాఖలో చంద్రబాబును చూసి చేతులు ఊపుతున్నారేంటి అని మోడీ అన్నారు. పట్టుదలతో, ప్రేమతో మీకు సేవ చేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ప్రజలు మమ్ముల్ని ఆశీర్వదించారు. అది మేం గుర్తుపెట్టుకుంటాం.

.పెందుర్తికి దాదాపు రూ.4,800 కోట్ల రూపాయలు అభివృద్ధి కోసం బండారు సత్యనారాయణమూర్తి తీసుకువచ్చారు.పెట్రో యూనివర్సిటీ, స్కిల్ డెవలప్ మెంట్ యూనివర్సిటీ, లా యూనివర్సిటీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కేటాయించాయి. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఆరులేన్ల జాతీయ రహదారి నిర్మించాం. పేస్ మేకర్స్, సీటీ స్కాన్ తయారు చేసే పరిశ్రమలను, మెడ్ టెక్ జోన్ ను తీసుకువచ్చాం.

ఇక్కడ బిల్డప్ బాబాయి ఉన్నాడు. మీ శాసనసభ్యుడు అదీప్ రాజు. ఆయన ఎక్కడ భూమి ఉన్నా వాలిపోతాడు. రాత్రికి చెరువు ఉంటుంది, తెల్లారేసరికి పట్టా అయిపోతుంది. సెంటు స్థలాల పేరుతో పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కొండలను కూడా వదిలిపెట్టడం లేదు. పేదవాడిలా బిల్డప్ ఇస్తాడు. బండారు పెద్దపెద్ద ప్రాజెక్టులు తీసుకువస్తే.. మీ ఎమ్మెల్యే ట్రాన్స్ ఫార్మర్ కు రిబ్బన్ కట్ చేస్తాడు.

అందుకే టీడీపీ-జనసేన అభ్యర్థిని గెలిపిస్తే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. టీడీపీ-జనసేన మధ్య చిచ్చుపెట్టేందుకు వైకాపా పేటియం బ్యాచ్ చిచ్చు పెడతారు. వారికి రూ.5 ఇస్తే చాలు. అలాంటివారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. వాటన్నింటిని తిప్పికొట్టాలి. జనసేన కార్యకర్తలు కూడా జాగ్రత్తగా ఉండాలి. టిడిపి-జనసేన కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి ప్రజాప్రభుత్వం ఏర్పాటుకు కృషిచేయాలి.

LEAVE A RESPONSE