అది వైఎస్సార్ సిపి..
అక్కడ అందరూ
‘ఎస్సార్’ సిపి..
ఈయనొక్కడే
‘వై..’సిపి..?
ప్రతి తప్పును ప్రశ్నించడమే..
ప్రతి ముప్పును ఎదుర్కోడమే!!
అధినేతేమో ప్రీఫిక్స్..
ఆయనేం చేసినా
సాయన్న లాజిక్స్..
సజ్జలేమో గ్రాఫిక్స్..
మొత్తంగా టీమంతా
మ్యాచ్ ఫిక్స్..!
ఇలాంటి ఓ బృందంలో
ఆడ్ మన్ ఔట్..
అడుగుతూనే ఉంటాడు..
అది నో డౌట్..
స్వపక్షంలోనే విపక్షం..
ప్రశ్నించేటప్పుడు ప్రతిపక్షం
ఎల్లప్పుడూ ప్రజల పక్షం!
తానేమో నిప్పు..
ఎప్పుడూ సభలో తనకు రాలేదంటాడు విప్పు..
అయినా..మా పార్టీలో
నిజం మాటాడితేనే తప్పు
మౌనమే భాషయితే
ఎలా తప్పుతుందయ్యా
ప్రజలకు ఈ ముప్పు..!
ఇలా ఉండడమే తనకిష్టం
మూసుకు కూర్చోమంటే కష్టం
దౌర్జన్యం వారి పంథా అయితే
దౌర్భాగ్యం తక్కినోళ్ళ
దందా అయితే..
అందరూ అధినేతకు
తాన తందానా..
మరి తనొక్కడే
ముందుకు పోతున్నాడు
తనకు నచ్చిన విధాన!
– సురేష్