-సిపిఎస్ పై మాట నిలుపుకోండి
– రఘురామకృష్ణం రాజు సలహా
జీ పీ ఎస్ రద్దు చేసి , ఓ పి ఎస్ ప్రవేశపెట్టే ప్రసక్తే లేదని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారని, ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుని హోదాలో ఉద్యోగులకు ఇచ్చిన హామీలను గుర్తుకు తెచ్చుకోవాలని నరసాపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు హితవు పలికారు. ఎన్నికల ముందు హామీలిచ్చి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ హామీలను అమలు చేయని రాజకీయ నాయకులను బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి రావాలన్న జగన్, ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పడితే వారం రోజుల వ్యవధిలోనే సిపిఎస్ ను రద్దు చేస్తానని ఉద్యోగులకు హామీ ఇచ్చారని ఈ సందర్భంగా రఘురామరాజు గుర్తు చేశారు.
పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ప్రసంగం వీడియోను ఆయన మీడియా సమావేశంలో ప్రదర్శించారు.. గురువారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీలోని తన నివాసంలో మీడియా ప్రతినిధులతో రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ… సిపిఎస్ ను రద్దు చేస్తామని ఉద్యోగులు తమకు ఓటు వేయలేదని, ఇతర కారణాల వల్లనే ఉద్యోగులు ఓట్లు వేశారని సజ్జల పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీ నే కాకుండా, పెళ్లి చేసుకున్న హిందూ, ముస్లిం యువతులను కూడా జగన్మోహన్ రెడ్డి మోసగించారన్నారు. వైయస్సార్ దులహన్ పథకం ద్వారా, పెళ్లి చేసుకున్న రోజే పెళ్లి కూతురు లకు లక్ష రూపాయలు అందజేస్తామనీ , అలాగే వైయస్సార్ పెళ్లి కానుక పథకం ద్వారా హిందూ యువతులకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటివరకు ఒక్కరికి అందలేదన్నారు. వైయస్సార్ పెళ్లి కానుక ఈ పథకం అమలుకు తనకు కొంత గడువు ఇవ్వాలని కోరిన జగన్మోహన్ రెడ్డి… అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా ఎందుకని అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం అరవీర, భయంకరంగా పోరాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చి యువతను, ముఖ్యమంత్రి అయిన వెంటనే చేతులెత్తేశారని రఘురామకృష్ణంరాజు ధ్వజ మెత్తారు.
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు భేషరతుగా మద్దతు ఇచ్చి దాసోహమయి, యువత ఆశలను నీరుగార్చారన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ , జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా…నిరుద్యోగ యువతను దగా చేశారన్న ఆయన, ఇక ఉద్యోగులను… పిఆర్సి పెంచుతామని, సిపిఎస్ ను రద్దు చేస్తామని చెప్పి ఓట్లు కొల్లగొట్టి మోసగించారన్నారు. ఉద్యోగుల పరిస్థితి ఉన్నది పాయే… అన్నట్లు తయారైందన్నారు.. ఇక రైతులకు సంవత్సరానికి 13 వేల ఐదు వందల రూపాయలు తానే ఇస్తానని చెప్పి, ఇప్పుడు కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు కూడా చెల్లించడం లేదని ఎద్దేవా చేశారు .
కార్మికులు, కాంట్రాక్టర్ల పరిస్థితి కూడా అధ్వాన్నంగా తయారైందన్నారు. గతంలో అమరావతిలో పనులు జరిగినప్పుడు కాంట్రాక్టర్లకు, కార్మికులకు చేతినిండా పని ఉండేదని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో… ఇసుక రద్దు చేయడంతో అన్నివర్గాల కార్మికులు పనులు లేకుండా కుదేలయ్యారన్నారు.. ఎన్నికల ముందు ప్రజలకు, వివిధ వర్గాల వారికి పార్టీ అధ్యక్షుడి హోదాలో జగన్మోహన్ రెడ్డి e ఇచ్చిన హామీలను అమలు చేయమంటే తనపై అనర్హత వేటు వేయాలని కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి విదేశాలలో ఉండగానే సిపిఎస్ రద్దు పై చర్చ లని చెప్పి, ఇప్పుడు రద్దు చేయడం కుదరదని వారితో, వీరితో చెప్పించడం కంటే… నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇ చెబితే బావుంటుందన్నారు. ఒకవేళ సిపిఎస్ రద్దు చేయడం కుదరదని భావిస్తే, అవగాహన లేమితో ప్రకటన చేశానని చెప్పి… ఉద్యోగులను క్షమించమని వేడు కోవాలని సూచించారు. ముఖ్యమంత్రి నేరుగా ప్రకటన చేస్తే.. ప్రజలు ఏమి చేయాలో నిర్ణయించుకుంటారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు..
దావోస్ లో ఇద్దరు మిత్రుల కథ…
దావోస్ పెళ్లి న బృందంలో సభ్యుడైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ పక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తో, పశు వైద్యుడు… వివిధ కేసుల్లో సీబీఐ గాలిస్తున్న పంచ్ ప్రభాకర్ భేటీ కావడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో కూడా ఆయన భేటీ అయినట్లు మాటల ద్వారా తెలుస్తోందన్నారు.. సీబీఐ కేసులలో ఏ వన్ నిందితుడిగా ఉండి, కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్ళిన వ్యక్తి, సిబిఐ గాలిస్తున్న మరొక వ్యక్తి తో భేటీ కావడాన్ని కోర్టులు ప్రశ్నిస్తాయని భావిస్తున్నానన్నారు. దావోస్ వెళ్లి వస్తాయో… రావో తెలియని ప్రాజెక్టులపై సంతకాలు చేసుకున్నారని, అలాగే ఎవరిని నిందించాలని… బూతులు మాట్లాడే ఆ వ్యక్తితో అనధికారికంగా ఎం వో యు కుదుర్చుకున్నారో చెప్పాలన్నారు. ఒకవైపు రాష్ట్రంలో జరిగిన సంఘటన కు నష్ట నివారణ చర్యలు చేపడుతున్న తరుణంలో, అదే సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బూతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
జిల్లాల పేర్ల మార్పు అనేది నిరంతర ప్రక్రియని మంత్రి సత్తిబాబు పేర్కొనడం పరిశీలిస్తే, మళ్లీ ఇంకో జిల్లాకు పేరు మార్చే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు.
మన దురాగతాల తో దూరమౌతున్న సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునేందుకు కోనసీమలో విఫలప్రయత్నం చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఎప్పుడూ తమ వెంటే ఉంచుకోవలసిన తుపాకులను పోలీసులు వదిలి వేయడం విస్మయాన్ని కలిగిస్తోందని చెప్పారు . మంత్రి విశ్వరూప్ అద్దెకు ఉంటున్న ఇల్లు దగ్ధం కావడం, నూతనంగా నిర్మించుకున్న ఇల్లు మాత్రం పాక్షికంగా దెబ్బతినడం… ఇక కోనసీమ జిల్లా ఉద్యమానికి తమ పార్టీ బీసీ విభాగం నాయకుడు మురళీ కృష్ణ నేతృత్వం వహించడం, సాయి ఉదంతం అన్ని పరిశీలిస్తే.. కోనసీమ ఘటనల వెనుక ఎవరున్నారో స్పష్టమవుతుందని అన్నారు. ఇదే విషయమై జర్నలిస్ట్ సాయి నిర్వహించిన ఆన్లైన్ సర్వేలోనూ 52 శాతం మంది వైసిపియే ఈ అల్లర్లకు కారణం అని పేర్కొనడం జరిగిందన్నారు. అయితే సాయి ఉద్దేశం మాత్రం… జనసేన, తెలుగుదేశం పార్టీ అని, ఆయనకు తమ ముఖ్యమంత్రి అంటే ఎంతో ప్రేమ ఆ విషయం జర్నలిస్టు సాయి మాటల్లో స్పష్టంగా వినిపిస్తుందన్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేరును కొందరు ప్రస్తావిస్తున్నారన్న ఆవేదనతో అసెంబ్లీలో జగన్ మాట్లాడినట్లుగా నే కోనసీమ ఘటనపై సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లా డడం విడ్డూరంగా ఉందన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, మంత్రి ఇళ్లను తామే తగల బెట్టు కుంట మా? అని ప్రశ్నించడం చూస్తే… గతంలో అసెంబ్లీ లో ఒక కన్నును మరొక కన్ను ఎక్కడైనా పొడుచుకుంటూ ఉందా?? అని జగన్మోహన్ రెడీ ప్రశ్నించినట్లు గానే ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ వివేకా హత్య కేసు పై కూడా, కోనసీమ సంఘటనపై జర్నలిస్టు సాయి నిర్వహించినట్లు గానే ఆన్ లైన్ పోల్ నిర్వహిస్తే ప్రజలు ఏమనుకుంటున్నారో తెలిసిపోతుందన్నారు.. కోనసీమ ఘటన వెనుక కౌన్సిలర్, వాలంటీర్, బీసీ నాయకులు ఉన్నారన్న ఆయన, వాలంటీరు 50 మందిని ఇతర ప్రాంతం నుంచి తరలించినట్లు గా పక్కా సమాచారం ఉందని… డి.ఎస్.పి పై జరిగిన రాళ్ల దాడిలో వాళ్లు పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కోనసీమ ప్రజలు శాంతికాముకులని, ఇళ్లపై దాడులు చేసే పనికిమాలిన పనులు చేయార న్నారు. కోనసీమ ఘటన అదేదో సినిమాలో చెప్పినట్టు గా శ్రద్ధగా చేశారని, ఈ ఘటనకు బాధ్యులైన వారిని అరెస్టు చేస్తామని చెప్పార ని… చూద్దాం దోషులను ఎంత వరకు అరెస్టు చేస్తారొనని ఆయన అన్నారు.
అనర్హతవేటన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు
రాష్ట్రపతి అభ్యర్థిగా గ తంలో దళిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి ఇవ్వడం వల్ల తాము స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చామని, ఈసారి బిజెపి అభ్యర్థి స్తే పరిశీలిస్తామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొనడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు.. ఏపీకి ప్రత్యేక హోదా అంశం పై సంతకం పెడితేనే, ఈసారి మద్దతిస్తామని చెప్పగలరా ?అంటూ ప్రశ్నించారు. లేకపోతే వివేకా హత్య కేసులో తమ వారి ప్రమేయం లేదని, అలాగే తనపై ఉన్న అక్రమ, సక్రమ కేసుల్లో నిర్దోషిగా ప్రకటించాలని కోరే అవకాశం ఉందన్నారు. గత రెండేళ్లుగా ప్రత్యేక హోదా కంటే, పార్లమెంట్ లో తన అనర్హత వేటు గురించే వైయస్సార్ పార్టీ పట్టుబడు తోందని, అయినా తనపై అనర్హత వేటు వేసే అవకాశ మే లేదన్నారు. తాను రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ ఎక్కడ కూడా ఉల్లంఘించలేదని చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి నీ రాణా ప్రతాప్ తో విజయ సాయి పోల్చడం విడ్డూరంగా ఉందన్నారు. ఒక రాజ పుత్రుడిగా తనకు నచ్చలేదని చెప్పుకొచ్చారు. రాణా ప్రతాప్ ఆజానుబాహుడనీ, ఆయనకు జగన్ కు పోలిక ఎక్కడ అని ప్రశ్నించారు.
ఏ సామాజిక వర్గం మెప్పుకోసం నిన్న మొన్న పనిచేశారో… మాల మహానాడు అధ్యక్షుడిగా పనిచేసిన జూపూడి ప్రభాకర్ రావు సంయమనం కోల్పోయి,మరొక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి అన్యాయం జరిగిందన్న ఆవేదన తో తన స్థాయికి తగని మాటలను అన్నారన్నారు