Suryaa.co.in

Andhra Pradesh

హోదా తీసుక రావడం చేతకాక విమర్శలా?

నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు

ప్రత్యేక హోదా తీసుకొస్తామని పదే పదే చెప్పినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమీ చేతకాక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ఎద్దేవా చేశారు. రాజు అజ్ఞాని అయితే గుడ్డిలో మెల్ల అని, అదే మంత్రి కూడా అజ్ఞాని కావడం దురదృష్టకరమని పరోక్షంగా సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి విమర్శలు చేశారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ఇంటింటికి స్టిక్కర్లను అంటించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందా?, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుందా?? అని ప్రశ్నించారు. స్టిక్కర్ కు 30 రూపాయల చొప్పున వేసుకున్న కోటి స్టిక్కర్లకు 30 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వ నిధులతో స్టిక్కర్లు ఇంటింటికి అంటిస్తే, ఆ స్టిక్కర్లలో ఫ్యాన్ గుర్తు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. 30 కోట్ల రూపాయలను పార్టీ నిధుల వెచ్చించి ఇష్టం ఉన్నవారి ఇంటికి మాత్రమే స్టిక్కర్లను అంటించాలని సూచించారు. ఒకవేళ బలవంతంగా వాలంటీర్లు స్టిక్కర్లను అంటిస్తే వీడియోలను తీసి, ఎన్నికల కమిషన్ కు నివేదించాలని కోరారు. గతంలో తమ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని ప్రకటిస్తే, ఆ విషయాన్ని ఎన్నికల కమిషన్ కు లేఖ రాయగా, తూచ్… తాను అలా అనలేదని జగన్మోహన్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు.

ఇంకొక మతాన్ని డామినేట్ చేయాలని ఒక ఐపీఎస్ అధికారి చెప్పడం దారుణం
రాజ్యాంగంలోని 33 వ అధికరణ ప్రకారం ఐపీఎస్ అధికారులు ఇతరుల మాదిరిగా స్వేచ్ఛగా మతం గురించి మాట్లాడే అధికారం లేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. సాధారణ పౌరులు రాజ్యాంగంలోని 25 వ అధికరణ ప్రకారం తమ మతం గురించి స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చునని అన్నారు. సాధారణ పౌరులకు ఉన్న మత స్వేచ్ఛ, పోలీసు అధికారులకు ఉండదని తేల్చి చెప్పారు. ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ కు హిందూ మతం అంటే అయి ష్టమని, క్రిస్టియన్ మతం అంటే ప్రేమ ఉంటే… తనలాంటి హిందూమతస్తుని ఉద్దేశపూర్వకంగానే హింసించి ఉంటారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. తాను గతంలో డివోపిటికీ సునీల్ కుమార్ వ్యవహార శైలి పై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. అంబేద్కర్ మిషన్ ఇండియా పేరిట స్వచ్ఛంద సంస్థను స్థాపించి, సమావేశాలను ఏర్పాటు చేసి… ఆర్ఎస్ఎస్ కు, ఆవుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం ఆర్ముడు ఆఫీసర్స్ నిబంధనలు ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో 60 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం బరిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం 40 శాతం నిధులనే ఖర్చు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులకు సరైన ప్రాచుర్యం కల్పించకపోతే అది ప్రజలకు అన్యాయం చేసినట్లే అవుతుందని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు..

LEAVE A RESPONSE