– ఏడాది పాలనపై పార్టీ శ్రేణులు సంబరాలు
కాకినాడ: తనకు కేటాయించిన రాజ్యసభ సభ్యత్వాన్ని ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించి, అందిన అవకాశాన్ని కాకినాడ జిల్లా ప్రజలకు సేవ చేయడానికి వినియోగిస్తున్న నాయకుడు రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ , రాజ్యసభ సభ్యుడు కార్యాలయం ఇన్ఛార్జి మేకా లక్ష్మణ మూర్తి పేర్కొన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ బాబు బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడలోని రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి నేతలు, సానా సతీష్ బాబు స్నేహితులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని సంబరాలు నిర్వహించారు.
రాజ్యసభ సభ్యుల కార్యాలయ ఇన్ఛార్జి మేకా లక్ష్మణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు తోట నవీన్, కాకినాడ నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్ ఆరిగెల శ్రీనివాస్ (బున్ని) సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబా, శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భీమా బత్తుల సత్యనారాయణ, సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పాల్గొన్నారు. అనంతరం భారీ కేకులు కట్ చేసి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుల కార్యాలయం ఇన్చార్జ్ మేకా లక్ష్మణ్ మూర్తి నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా తోట నవీన్ మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యుడిగా సానా సతీష్ బాబు బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. పదవికి గౌరవం తెచ్చే విధంగా ఆయన పని తీరు ఉందని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్న నాయకుడిగా గుర్తింపు పొందారని అన్నారు.
కార్యక్రమ అధ్యక్షుడు మేకా లక్ష్మణమూర్తి మాట్లాడుతూ, సానా సతీష్ బాబు తనకు లభించిన పదవిని బాధ్యతగా భావించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కాకినాడ నగరంలో క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి కృషి చేయడం, సర్పవరం గ్రామంలో మినీ స్టేడియం ఏర్పాటు, బొద్ధవరం గ్రామంలో గ్రామస్తుల 40 ఏళ్ల కల అయిన వంతెన నిర్మాణం సాధించడం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన నాయకత్వానికి నిదర్శనమన్నారు. గత 34 వారాలుగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ద్వారా సుమారు 80 శాతం ప్రజా సమస్యలకు పరిష్కారం చూపి ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు.
శెట్టిబలిజ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాజ్యసభ సభ్యులుగా సానా సతీష్ బాబు ఏడాది కాలంలో కాకినాడ జిల్లాకు అనేక సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించారని తెలిపారు.
సీనియర్ నాయకులు నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, సానా సతీష్ బాబు తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్లమెంట్ వేదికగా కాకినాడ జిల్లా సమస్యలపై తన గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు న్యూటన్ ఆనంద్, జున్నూరు బాబ్జి, కామాడి దశరథ్, డీఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్ కుమార్, న్యాయవాది నరేంద్ర, దేవ్ వెంకన్న, రామదేవ సీతయ్య దొర,తో పాటు పెద్ద సంఖ్యలో టిడిపి కార్యకర్తలు, కూటమి నాయకులు పాల్గొన్నారు