కాణిపాకం: ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) సందర్భంగా కాణిపాకంలో వెలిసిన శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి వారిని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి చాలా విశేషమైన ముక్కోటి ఏకాదశి (పుత్రదా ఏకాదశి)రోజున సుప్రసిద్ధ వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించారు. తమ గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా వేద పండితులు ఎంపీ రవిచంద్ర తదితరులను శాలువాలతో సత్కరించి ఆశీర్వచనాలు పలికారు, వినాయక స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.