• అధికారంలో ఉన్నా..ప్రతిపక్షంలో ఉన్నా జగన్ ఫేక్ మీడియాను అడ్డంపెట్టుకొని, ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుంటున్నాడు.
• కర్నూలుజిల్లా డోన్ లో దళితులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడింది చూస్తే, ఆయన దళితజాతి అభ్యున్నతికోసం ఎంతగా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది.
• అధికారదాహంతో జగన్ అతని ఫేక్ మీడియా చేసే విషప్రచారాన్ని నమ్మవద్దని దళితులకు విజ్ఞప్తిచేస్తున్నా.
– యువగళం పాదయాత్ర ప్రదేశంలో (పత్తికొండ) టీడీపీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు
“ లోకేశ్ ధాటికి తట్టుకోలేకనే సాక్షిమీడియా, జగన్ విసిరే ఎంగిలిమెతుకులు తినే వైసీపీ సోషల్ మీడియా విషప్రచారానికి తెరలేపింది. యువగళం పాదయాత్రలో డోన్ నియోజకవ ర్గంలో దళితులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేశ్ మాట్లాడిన దాన్ని వక్రీకరిస్తూ, దళితు లు పీకింది ఏమిలేదు అని లోకేశ్ అన్నట్టు తప్పుడుప్రచారం చేయడం జగన్, అతని దిక్కు మాలిన మీడియా సాక్షికి, అతని చిల్లరకు కక్కుర్తిపడే పేటీఎం బ్యాచ్ కే చెల్లింది. గతంలో చంద్రబాబుపైకూడా సాక్షి మీడియా, జగన్ పేటీఎమ్ బ్యాచ్ ఇలానే దుర్మార్గంగా విషప్రచారం చేసింది.
“తెలిసితెలిసి ఎవరైనా పేదరికంలో పుట్టాలని అనుకుంటారా..దళితులే ఎక్కువగా పేదరికంలో మగ్గిపోతున్నారు” అని చంద్రబాబు అంటే, దాన్ని వక్రీకరించి, తెలిసితెలిసి ఎవరై నా దళితులుగా పుట్టాలని అనుకుంటారా అని చంద్రబాబు అన్నట్టు ప్రాపకాండ చేశారు. అలానే పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉన్నట్టు, అమరావతి, పోలవరం, పట్టిసీమ నిర్మాణంలో చంద్రబాబు అతనిప్రభుత్వం అవినీతిచేసిందని భారీస్థాయిలో దుష్ప్రచారం చేశారు. ఉన్నదాన్నిలేనట్టు..లేనిదాన్ని ఉన్నట్టు ప్రజల్ని నమ్మించడానికి, జగన్ అతని అవినీతి మీడియా దుర్మార్గంగా ప్రవర్తిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నాజగన్ తనచేతిలో ఉన్న ఫేక్ మీడియా సాయంతో ఫేక్ ప్రచారాన్నే నమ్ముకుంటున్నాడు.
సొంతజాతికి జగన్ చేస్తున్నఅన్యాయం, ప్రభుత్వంలోని దళితమంత్రులకు, వైసీపీలోని దళితనేతలకు కనిపించడం లేదా?
దళితులపై జగన్, అతనిప్రభుత్వం సాగిస్తున్న మారణకాండను ఎదిరిస్తోంది.. జగన్ ను నిలదీస్తోంది చంద్రబాబు, టీడీపీ, లోకేశ్ లే. డాక్టర్ సధాకర్ మొదలు డాక్టర్ అచ్చెన్నవరకు దళితులపై జరిగిన నరమేథం మొత్తం జగన్ కనుసన్నల్లో జరిగిందే. డాక్టర్ సుధాకర్ ను చంపింది వైసీపీప్రభుత్వం.. జగన్ అయితే, సుధాకర్ కుటుంబానికి లోకేశ్ అండగా నిలిచారు. కావలిలో కరుణాకర్ అనే దళితయువకుడికి వైసీపీప్రభుత్వం అన్యాయంచేస్తే, అతను తనఇల్లుతాకట్టుపెట్టి, రోడ్డునపడితే, ఆఇంటిని విడిపించి, కరుణాకర్ కుటుంబాన్ని ఆదుకుంది నారాలోకేశ్. వైసీపీఎమ్మెల్సీ అనంతబాబు తనవద్ద డ్రైవర్ గా పనిచేసే దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపేసి, అతనిశవాన్ని డోర్ డెలివరీ చేశాడు. ఆ సమయంలో సుబ్రహ్మణ్యం కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసహాయంచేసి, కుటుంబ సభ్యులకు నేనున్నాను అనిధైర్యంచెప్పింది లోకేశ్. వైసీపీ ఎమ్మెల్సీ దుర్మార్గానికి బలైన అనంతబాబు కుటుంబానికి అండగానిలిచి, కుటుంబసభ్యుల్ని ఆదుకుంది లోకేశ్ ఒక్కడే. దళితయువతి రమ్యను వైసీపీప్రభుత్వంలో అతికిరాతకంగా హతమారిస్తే, ఆమెకుటుంబాన్ని పరామర్శించడానికివెళ్తున్న లోకేశ్ ను అడ్డుకుంది ఈ ప్రభుత్వంకాదా? అమరావతిలోని దళితరైతులపై జగన్ తప్పుడుఅట్రాసిటీ కేసులుపెట్టిస్తే, వారికి అండగా నిలిచింది లోకేశ్. అలాంటి లోకేశ్ పై విషప్రచారంచేస్తూ, టీడీపీనుంచి దళితుల్ని వేరుచేయాలన్నదే జగన్ కుట్ర. జగన్ నిజంగా దళితుల్ని ఉద్ధరించేవాడే అయితే, సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా చంపిన సొంతపార్టీఎమ్మెల్సీని ఎందుకు శిక్షించలేదు. పైగా అతను జైలునుంచి తిరిగివస్తుంటే సొంత పార్టీవారితో పూలుచల్లించి, జై అనంతబాబు..జై జై అనంతబాబు అని నినాదాలతో ఘనమైన స్వాగతం పలుకుతారా?
రూ.7వేలకోట్ల ఎస్సీ కార్పొనేషన్ నిధుల్ని, రూ.28వేలకోట్ల ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించినప్పుడు దళితమంత్రులు ఎందుకు నోరెత్తలేదు?
దళితులకు నిజమైన సంక్షేమం అందించి, వారిని ఆర్థికంగా, సామాజికంగా వృద్ధిలోకి తీసుకొచ్చింది టీడీపీ, చంద్రబాబే. సాక్షాత్తూ హైకోర్టే వైసీపీప్రభుత్వం రూ.7వేల కోట్ల ఎస్సీకార్పొరేషన్ నిధులు దారిమళ్లించింది అనిచెబితే, ప్రభుత్వంలోని దళితమంత్రులు ఏంచేశారు? దానికి సంబంధించి జగన్ ఎవరిపై చర్యలు తీసుకున్నాడు? రూ.28వేలకోట్ల ఎస్సీఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని జగన్ దారిమళ్లిస్తే, ప్రభుత్వంలోని, అధికారపార్టీలోని దళిత నేతలు ఎందుకుమాట్లాడలేదు? ఏనాడూ ఎందుకు జగన్ ని నిలదీయలేదు? సాంఘిక సంక్షేమశాఖమంత్రికి జగన్ దళితజాతికి చేస్తున్న అన్యాయం, వారిపైచేయిస్తున్న దాడులు, సాగిస్తున్న దమనకాండ కనిపించడంలేదా? అననిమాటలు అన్నట్లు టీడీపీపై, చంద్రబా బుపై, లోకేశ్ పై విషప్రచారంచేయడంలో ముందుండే వైసీపీపేటీఎం బ్యాచ్, ప్రభుత్వంలోని దళితనేతలు ఎవరైనాసరే టీడీపీప్రభుత్వంలో దళితులకుజరిగిన సంక్షేమం, మేలుపై బహిరంగచర్చకు రాగలరా? వచ్చే దమ్ము, ధైర్యం జగన్ కుగానీ, అతని పేటీఎం బ్యాచ్, అతని ప్రభుత్వంలోని దళిత మంత్రులకు ఉందా?
రాష్ట్రంలోని దళితులు డోన్ లో లోకేశ్ మాట్లాడిన వీడియో చూస్తే, ఆయన దళితజాతి అభ్యున్నతికోసం ఎంతగా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుంది. వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి కుట్రపూరితంగా లోకేశ్ పై చేస్తున్న విషప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని దళితజాతికి పిలుపునిస్తున్నాను. లోకేశ్, టీడీపీ, చంద్రబాబుపై ఇదేవిధంగా విషప్రచారం చేస్తే సాక్షి కార్యాలయాల ముందు టీడీపీ దళిత విభాగాలు ధర్నాలకు దిగుతాయి.”