Suryaa.co.in

Political News

మునుగోడు ఉప ఎన్నిక ఎవరి కోసం?

ప్రతి అభ్యర్థి నేను గెలవాలి నా పార్టీ గెలవాలి అనుకుంటాడు కాని ప్రజలు గెలవాలి అని అనుకోడు ప్రజల కోసం అసలే కాదు ఉప ఎన్నిక. ముగ్గురు వ్యక్తులు మూడు పార్టీలు ఉపఎన్నికలలో గెలవడానికి తలా మూడు వందల కోట్లు ఖర్చు చేయవచ్చు మొత్తానికి వేయి కోట్లు.

అక్రమ సంపాదన అక్రమంగా పంచుతారు
అన్ని పార్టీల తరుపున రెడ్లు రంగంలో ఉంటారు ఎందుకంటే వందల కోట్లు వారి వద్దనే ఉన్నాయి
జనాభ మాత్రం బిసి లు ఎక్కువ గా ఉన్నారు కాని బిసి లలో ఐక్యత బీసీ లకు మాత్రమే ఓటు వేయాలనే చైతన్యం లేదు
7 సార్లు రెడ్లను 5 సార్లు వెలమలను గెలిపించారు మునుగోడు వాసులు రాజకీయ పార్టీలు కూడా రెడ్లను వెలమలను
నిలపెట్టాయి ఈ రెడ్లు వెలమలు వేల కోట్లు సంపాదించు కున్నారు
అన్ని పార్టీల నాయకుల మాటలలో తీయదనం చేతలలో చేదుదనం ఉంటుంది
తమ పార్టీ కీ తమ పెద్ద నాయకుడికి విదేయూడిగా మాత్రమే ఉంటారు కాని ప్రజలకు విధేయులుగా ఉండరు
దురదృష్టం ఏమిటంటే వీరికోసం కార్యకర్తలు రక్తాలు కారే టట్లు కొట్టుకుంటారు ఒకోక సారి ప్రాణాలు కూడా తీసుకుంటారు
గమ్మత్తు ఏమిటంటే కార్యకర్తలు ఎవ్వరి కోసం కొట్టు కుంటారో అదే నాయకులు ఒకరికి ఒకరు ఎదురు పడినప్పుడు పలరించుకుంటారు
కావున మునుగోడు ఓటర్లు ప్రలోబాలకు గురి కాకుండా నీతిగా నిజాయితీగా ఓటు వేయాలి
లంగలు అక్రమ సంపాదన చేసే వారు మాత్రమే పైసలు పంచుతారు బట్టలు మందు బిర్యానీ పైసలు పంచే వారు నీచులు నికృష్టులు గమనించండి
మునుగోడు లో ప్రజలు నిజాయితీగా ఓటు వేయాలని కోరుకుంటూ

 నారగొని ప్రవీణ్ కుమార్
సామాజిక కార్యకర్త

LEAVE A RESPONSE