• వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు
• గ్రామంలో 400 కుటుంబాలున్నాయి…తీవ్రమైన నీటిఎద్దడి ఉంది
• ఫ్లోరైడ్ సమస్యతో నడుముల నొప్పులు, గారపళ్లు, మోకాళ్లనొప్పులతో బాధపడుతున్నాం
• ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి, ప్రతి ఇంటికీ కుళాయి సదుపాయం కల్పించాలి
• రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో ప్రజలకు గుక్కెడు నీళ్లందించడం చేతగాని ముఖ్యమంత్రి లక్షలకోట్లతో సంక్షేమం చేశానని ప్రగల్భాలు పలకడం సిగ్గుచేటు.
• గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సదుపాయం కల్పించుకునేందుకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా ఈ ప్రభుత్వం వినియోగించుకోలేకపోతోంది.
• జల్ జీవన్ మిషన్ అమలులో రాష్ట్రం 18వ స్థానంలో ఉంది.
• టీడీపీ అధికారంలోకి వచ్చాక వాటర్ గ్రిడ్ ఏర్పాటుచేసి, ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా స్వచ్చమైన మంచినీరు అందిస్తాం.
• వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన రాముడుపాలెం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం రాముడుపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• రాముడుపాలెం, పుచ్చనూతల పంచాయతీల్లో తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం.
• ఫ్లోరైడ్ నీటి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నాం.
• మా గ్రామంలో 300కుటుంబాలు నివసిస్తున్నాం.
• ఓవర్ హెడ్ ట్యాంకు, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరు అందించాలి.
• మా ప్రాంతం మొత్తం వ్యవసాయ ఆధారిత ప్రాంతం.
• వ్యవసాయం, కూలీపనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాం.
• పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకోవాలి.
నారా లోకేష్ స్పందిస్తూ…
• జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామాభివృద్ధికి గ్రహణం పట్టింది.
• పంచాయతీల అభివృద్ధికి కేంద్రం విడుదల చేసిన నిధులు రూ.9వేల కోట్లు జగన్ ప్రభుత్వం దొంగిలించింది.• పంచాయతీల్లో బ్లీచింగ్ చల్లడానికి కూడా చిల్లిగవ్వ లేని దుస్థితి నెలకొంది.
• టీడీపీ హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కిలోమీటర్ల సీసీరోడ్లు వేశాం.
• టిడిపి అధికారంలోకి వచ్చాక రాముడుపాలెం గ్రామానికి తాగునీటి సమస్యను పరిష్కరిస్తాం.
• వాటర్ గ్రిడ్ ద్వారా సురక్షిత నీటిని ఇంటింటికీ కుళాయిల ద్వారా అందిస్తాం.
• వ్యవసాయ పెట్టుబడులు తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన పుచ్చనూతల జెసి నగర్ వాసులు :
వినుకొండ నియోజకవర్గం పుచ్చనూతల జెసినగర్ వాసులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
• మాకు శ్మశాన వాటికలు లేక వాగుల్లో మృతదేహాలను ఖననం చేస్తున్నాం.
• శ్మశాన వాటిక స్థలం కోసం ఎంతలా పోరాడినా ఫలితం లేకుండా పోయింది.
• ఇళ్ల పట్టాల కోసం ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ఇవ్వడం లేదు.
• స్థలాలు లేక ఇళ్లు నిర్మించుకోవాలంటే భారంగా ఉంది.
• ఖాళీ ప్రభుత్వ భూములను వ్యవసాయం చేసుకునేందుకు కేటాయించాలి.
• ప్రభుత్వాసుపత్రుల్లో సరైన సదుపాయాలు లేవు. దీంతో ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది.
• ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో లేక బయట నుండి కొనుగోలు చేస్తున్నాం.
• చేపలు పట్టుకునేందుకు వలలు, ఐస్ బాక్సులు అందించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతిస్కీమ్ లోనూ ఒక స్కామ్ ఉంటుంది.
• సెంటుపట్టాల పేరుతో పనికిరాని స్థలాలను కేటాయించి రూ.7వేల కోట్లు దోచుకున్నారు.
• టిడిపి అధికారంలోకి రాగానే ప్రతిపేదవాడికి ఇంటిస్థలంతోపాటు ఇల్లు నిర్మించి ఇస్తాం.
• జెసినగర్ లో శ్మశానవాటికకు స్థలాన్ని కేటాయిస్తాం.
• జగన్ దివాలాకోరు ప్రభుత్వం కారణంగా ప్రభుత్వాసుపత్రుల్లో దూది, గాజుగుడ్డ కూడా లేని దుస్థితి నెలకొంది.
• ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యలను మెరుగుపరుస్తాం.
• ఆదరణ పథకాన్ని తిరిగి ప్రవేశపెట్టి మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు సబ్సిడీపై అందిస్తాం.
నారా లోకేష్ ను కలిసిన రవ్వవరం గ్రామస్తులు
వినుకొండ నియోజకవర్గం రవ్వవరం గ్రామస్తులు నారా లోకేష్ ను కలిసి వినతిపత్రం అందించారు.
• టీడీపీ హయాంలో గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించారు.
• సైడు కాలువలు నిర్మించే సమయంలో ప్రభుత్వం మారాక పనులు చేపట్టలేదు.
• గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడుతున్నారు.
• పొలాలకెళ్లే రోడ్లు సరిగా లేక ఇబ్బంది పడుతున్నాం.
• అధికారంలోకి వచ్చాక మా సమస్యలు పరిష్కరించండి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• జగన్మోహన్ రెడ్డి దివాలాకోరు పాలనలో గ్రామీణ రోడ్లు తటాకాలను తలపిస్తున్నాయి.
• గ్రామపంచాయితీలకు చెందిన నిధులను జగన్ ప్రభుత్వం దొంగిలించడంతో అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయి.
• టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.
• గ్రామాలనుంచి పొలాలకు వెళ్లే పుంతరోడ్ల నిర్మాణం చేపట్టి రైతుల ఇబ్బందులను తొలగిస్తాం.
లోకేష్ కు ఉమ్మడి గుంటూరునేతల అపూర్వ స్వాగతం
వినుకొండ నియోజకవర్గం ముప్పరాజుపాలెం వద్ద పల్నాడు జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు నేతృత్వంలో యువనేతకు ఘనస్వాగతం.
వేదపండితుల ఆశీర్వచనాలతో యువనేతను స్వాగతించిన పల్నాడు జిల్లా ప్రజలు.
వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
యువనేతకు స్వాగతం పలికిన తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నాలక్ష్మీనారాయణ, నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల
నరేంద్ర, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, కొమ్మాలపాటి శ్రీధర్, కోవెలమూడి రవీంద్ర, నజీర్ అహమ్మద్, వేగేశన నరేంద్ర వర్మ,మన్నవ మోహనకృష్ణ, చదలవాడ అరవింద్ బాబు, భాష్యం ప్రవీణ్, కందుకూరి వీరయ్య, గోనుగుంట్ల కోటేశ్వర రావు, పోతినేని శ్రీనివాస్ తదితరులు.భారీ గజమాలలు, స్వాగతద్వారాలు, బాణాసంచా మోతలతో హోరెత్తించిన వినుకొండ కార్యకర్తలు. అడుగడగునా యువనేతకు హారతులతో నీరాజనాలు పడుతున్న మహిళలు.