Suryaa.co.in

Telangana

మురళి ముకుంద్ సభ్యుడిగా, సెక్రటరీగా అనర్హుడు

– జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వ సభ్యుల సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

ఆదివారం సొసైటీ కమ్యూనిటీ హాల్లో జరిగిన జూబ్లీహిల్స్ కోపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కమిటీ సెక్రటరీగా కొనసాగుతూ పలు అవకతవకలకు పాల్పడ్డ మురళి ముకుంద్ ను సభ్యుడిగా, సెక్రటరీగా అనర్హుడుగా ప్రకటిస్తూ సర్వసభ్య సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. సెక్రటరీ పదవిలో ఉంటూ సొసైటీ మరియూ సభ్యుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా మురళి ముకుంద్ వ్యవహరించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రకటించారు.

సొసైటీ పరిధిలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ నిర్వాహకుడిగా మురళి ముకుంద్ పాల్పడుతున్న పలు అవకతవకలపై సభ్యులు మురళీ ముకుంద్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఫేస్స్ ఫోర్ ప్రారంభించేందుకుసొసైటీ సభ్యులు అయిన రిటైర్డ్ IAS IPS అధికారుల తో నూతన కమిటీ వేయాలని తీర్మానం చేశారు. JHCHBS పరిధిలో ఉన్న పాత షాపింగ్ కాంప్లెక్స్ స్థానంలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలన్న కీలక నిర్ణయం కూడా ఈ సర్వ సభ్య సమావేశంలో తీర్మానించారు. గత పాలకవర్గం హయాంలో జరిగిన పలు అవకతవకలను సొసైటీ అధ్యక్షులు రవీంద్రనాథ్ వివరించారు.

సొసైటీ పరిధిలోని విలువైన భూములను ఏరకంగా ఎస్.ఆర్ వాల్యూ కంటే తక్కువ ధరకే అమ్మారనే విషయంలోనూ, కొందరికి లబ్ధి చేకూర్చుతూ సొసైటీ ఆస్తులను తక్కువ మొత్తానికే రెంట్ లీజ్ చేసుకున్న వైనాన్నీ రవీంద్రనాథ్ సభ్యులకు వివరించారు. సొసైటీ బైలాస్ ను సవరిస్తూ తీసుకున్న నిర్ణయానికి కూడా ఈ సమావేశంలో ఆమోదం లభించింది. సుమారు 700 మంది సభ్యులు హాజరైన ఈ సమావేశంలో సభ్యుల హర్షద్వానాల మధ్య అన్ని తీర్మానాలూ ఏకగ్రీవంగా ఆమోదం పొందినట్టు కమిటీ అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలియజేశారు.

LEAVE A RESPONSE