-నిజమైన ‘సూర్య’వెబ్‌సైట్ కథనం
-మురళీ రాజీనామాను గత నెలలోనే వెల్లడించిన సూర్య వెబ్‌సైట్
మాజీ ఐఏఎస్, ఏపీ ప్రభుత్వ సలహాదారు ఆకునూరి మురళి తన పదవికి రాజీనామా చేశారు. కాగా మురళీ రాజీనామా చేసే యోచనలో ఉన్నారని, ఆమేరకు ఆయన ప్రభుత్వానికి లేఖ కూడా రాశారంటూ ఆగస్టు 19న నాటి సూర్య వెబ్‌సైట్‌లో సలహాదారు పదవికి మురళీ రాజీనామా? శీర్షికతో వార్తా కథనం వెలువడిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన రాజీనామా చేయడంతో సూర్య కథనం నిజమయింది. సలహాదారు పదవికి మురళీ రాజీనామా?
పాఠశాల విద్యాశాఖలో మౌలిక సదుపాయాల సలహాదారు ఎ.మురళి తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అక్కడి పరిస్థితి మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. తన సేవలు తెలంగాణలో అవసరం ఉందంటూ సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లుగా ఏపీ ప్రభుత్వంలో పాఠశాల విద్యాశాఖ సలహాదారుగా పనిచేయడం గొప్ప అనుభూతి. సీఎం జగన్ పాఠశాల విద్యాశాఖ, ముఖ్యంగా నాడు-నేడుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇదే సమయంలో నా స్వరాష్ట్రం తెలంగాణలో విద్య, వైద్యం పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అందుకే నా సేవలు పూర్తిగా తెలంగాణలో అందించేందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో వెల్లడించారు.