Suryaa.co.in

International

నిరసనల నెపంతో బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలు

బంగ్లాలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ప్రధాని పదవికి షేక్‌ హసీనా రాజీనామా చేసేశారు. ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని వ్యతిరేకిస్తూ చెలరేగిన హింస తీవ్రరూపం దాల్చింది. వేలాది మంది నిరసనకారులు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారులు ఆయుధాలు పట్టుకొని వాహనాలు, దుకాణాలు, కార్యాలయాలను ధ్వంసం చేస్తున్నారు.

అయితే… రిజర్వేషన్ అంశాన్ని సాకుగా చేసుకున్న ఇస్లామిక్ చాందసవాదులు హిందువులను టార్గెట్‌గా చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. ఆదివారం రోజున సిరాజ్‌గంజ్‌లోని రాయ్‌గంజ్‌ ప్రెస్‌క్లబ్‌పై దాడులు జరిగాయి. ప్రెస్‌ క్లబ్‌ను ముట్టడి చేసి, ప్రదీప్‌ భౌమిక్‌ అనే హిందూ జర్నలిస్టుపై దారుణంగా దాడి చేశారు.బాధితుడ్ని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తున్న సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రదీప్‌ భౌమిక్‌ ఖోబోర్‌ పాత్రా అనే దినపత్రికకు రాయగంజ్‌ కరస్పాండెంట్‌గా బాధ్యతల్లో వున్నారు. మరోవైపు హిందూ కౌన్సిలర్ కాజల్ రాయ్‌ని కూడా నిరసన నెపంతో హత్య చేశారు.

LEAVE A RESPONSE