– అర్ధవీడు మండలంలో రూ. 1.25 కోట్ల అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల
గిద్దలూరు: రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగిస్తున్నది మాటల ప్రభుత్వం కాదని, ఇచ్చిన ప్రతి మాటను నెరవేర్చే చేతల ప్రభుత్వమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. పల్లె పండుగ ప్రగతికి అండగా పంచాయతీ వారోత్సవాలలో భాగంగా అర్ధవీడు మండలంలో రూ.1.25 కోట్ల రూపాయల అంతర్గత సీసీ రోడ్లకు వారు శంకుస్థాపన చేశారు.
మొహిద్దిన్ పురం గ్రామంలో రూ.35 లక్షలు, అర్ధవీడు గ్రామంలో రూ. 50 లక్షలు, పాపినేనిపల్లె గ్రామంలో రూ. 60 లక్షల రూపాయలతో ప్రారంభించనున్న అంతర్గత సీసీ రోడ్లకు శంకుస్థాపన స్థాపనలు చేసి గ్రామాల్లో శిలాఫలకాలను ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో డీఈ సుబ్బారెడ్డి, ఎంపీడీఓ నరసయ్య, మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.