ప్రొఫెసర్ జీ. నాగ సాయిబాబా గారు ఉస్మానియా యూనివర్సిటీ సమీపంలోని సీతాఫల్ మండీలో ఉన్నప్పుడు ఆయన నాకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పారు! నాకొచ్చిన ఈ కొద్ది ఇంగ్లీష్ ఆయన, మా మేనమామ గార్ల చలవే!
సాయిబాబా గారు సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ [అప్పటి సీఫెల్ ఇప్పటి ఇఫ్లూ] లో మా మేనమామ టీ. శరత్ బాబు గారి క్లాస్ మెట్! ఇద్దరూ కలిసి పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ టీచింగ్ ఆఫ్ ఇంగ్లీష్ [పీజీడిటీఈ] కోర్సు చేశారు! సాయిబాబా గారు వారి సతీమణి వసంత గారితో కలిసి సీతాఫల్ మండీలో ఒక చిన్న పాత ఇంట్లో అద్దెకుండేవారు!
ప్రొఫెసర్ సాయిబాబా, వసంత గార్లకు మా మేనమామ శరత్ బాబు గారు, మరొకరు కలిసి సాక్షి సంతకాలు పెట్టి రిజిస్టర్ మ్యారేజ్ చేశారు! నేను ఢిల్లీలో ఉండగా ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో ప్రొఫెసర్ సాయిబాబా గారిని అప్పట్లో మళ్లా కలిసాను! ఆయన ఆత్మ సద్గతులు పొందాలని నా ప్రార్థన!