Suryaa.co.in

Telangana

నా పోటీ సీఎంలతోనే!

-నాడు వైఎస్‌తోనే పోటీ పడ్డా
– కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి

జగిత్యాల : తన పోటీ ఎప్పుడూ సీఎంలు, సీఎం స్థాయి వ్యక్తులతోనే ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాడు వైఎస్‌తోనే పోటీ పడ్డానని గుర్తు చేశారు. గతంలో అభివృద్ధి విషయంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోటీ పడ్డానని గుర్తు చేసుకున్నారు.

గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అరాచకాలపై తాము నిరంతరం పోరాటం చేశామని, ఆ పోరాట ఫలితంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని జీవన్ రెడ్డి అన్నారు.

జగిత్యాల శాసనసభ్యుడు సంజయ్ కుమార్‌పై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ఎమ్మెల్యే పనితీరును ప్రశ్నించారు. గత పదేళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు కొత్తగా జరుగుతుందా? ఎమ్మెల్యే సంజయ్‌కు నా కంటే ఎక్కువ రాజకీయ అనుభవం ఉందా? అని అని నిలదీశారు.

LEAVE A RESPONSE