– రాజ్యసభ ఎన్నికల కోసమే నా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు
తనపై ఉన్న కేసుల వల్లే ప్రధానితో స్టీల్‍ప్లాంట్ కోసం గట్టిగా మాట్లాడలేదు
– మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
విశాఖ స్టీల్‍ప్లాంట్ కోసం జగన్ గట్టిగా మాట్లాడలేదు. తనపై ఉన్న కేసుల వల్లే ప్రధానితో గట్టిగా మాట్లాడలేదు. జగన్ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే స్టీల్‍ప్లాంట్‍కు ఈ పరిస్థితి వచ్చేది కాదు. స్టీల్‍ప్లాంట్ కోసం 2021 ఫిబ్రవరిలో స్పీకర్ ఫార్మాట్‍లో రాజీనామా చేశా. రాజీనామా ఆమోదించాలని గతంలో పలుసార్లు స్పీకర్‍ను కోరా. ఉపఎన్నిక భయంతోనే నా రాజీనామాను ఇన్నాళ్లూ ఆమోదించలేదు.
రాజ్యసభ ఎన్నికల కోసమే నా రాజీనామాను ఇప్పుడు ఆమోదించారు .ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిలిన దెబ్బ జగన్‍కు గుర్తుంది. రాజీనామాలే కాదు.. అంతకు మించిన త్యాగాలకు సిద్దంగా ఉన్నాం. సీఎం జగన్ విలువలకు సిలువలు వేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‍పై వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయగలరా? జగన్ పరిపాలనపై వైసీపీ నేతలూ చాలా అసంతృప్తిగా ఉన్నారు. నా రాజీనామా ఆమోదం.. వైసీపీ పాలనకు చెల్లుచీటీ.